ఈ సారి మ్యాచ్‌ గెలవాల్సిందే..

0
551
 Posted [relativedate]
This time we shpuld win the matchయూపీ ఎన్నికలపై బీజేపీ సంకల్పం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఉత్తర ప్రదేశ్‌  ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి… మిగితా పార్టీలతో పోల్చితే భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఇవి చావో రేవో అన్నట్టు ఉంది పరస్థితి.. ఎప్పుడో పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న టైంలో అధికారం దక్కించుకున్న ఆ తరవాత తీవ్రంగా దెబ్బదిని కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. తాజా సార్వత్రిక ఎన్నికలో అనూహ్యంగా యూపీలోని అన్ని ప్రాంతాలపై పట్టుసాధించగలిగింది.
bjp-rssబీహార్‌ ఎన్నికల ప్రభావంతో కొంత ప్రభ తగ్గినా సర్జికల్‌ దాడులతో పుంజుకుంది.. మరోవైపు పార్టీ అధినేత అమితిషాకు ఆ ప్రాంతంపై పూర్తిస్థాయిలో పట్టుఉండటం కొంత సానుకూలాంశమే.. లోక్‌సభ ఎన్నికల కోసం 2011 నుంచే ఆయన అక్కడ పాగా వేశారు. ఏ ప్రాంతం ఎలాంటి వాటికి స్పందింస్తుందో తెలుసు.. ఎక్కడ ఏ సమస్యలను ఎత్తి చూపాలో.. ఎవరిని రెచ్చగొట్టాలో.. ఎవరిని బుజ్జగించాలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య… దానికితోడు బీహార్‌ ఎన్నికల సమయంలో చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు.. సార్వత్రిక ఎన్నికకు, అసెంబ్లీకి ప్రజలు ఆలోచన విధానం ఎలా మారుందో బాగా అర్థమైంది.. ముఖ్యంగా స్థానికత అనేది ఎంత కీలకమో తెలిసొచ్చింది.. అవన్నీటిని పరిశీలించి పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
మరో వైపు అధికార పార్టీ కుమ్ములాటలు.. ఎస్పీకి ముస్లింలు దూరం కావడం.. ముస్లిం పార్టీలన్నీ ఒకే గొడుకు కిందకు పనిచేయాలనుకోవడం.. ఓట్ల చీలకతో లాభం పొందచ్చొని భావిస్తుంది.. మరోవైపు అగ్రవర్ణాలకు మాయావతి పెద్దపీఠ వేయడంతో దళితనాయకులు అలిగి కొందరు పార్టీకి దూరం జరిగారు.. మరికొందరు వేరే ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు.. ఈక్రమంలో బీఎస్పీ అంటే దళిత పార్టీ అనే స్థితి నుంచి దళితులకు న్యాయం జరగదు అనేలాంటి పరిస్థితి ఉందంటూ ప్రచారం జరగడం కూడా కలిసొచ్చేదే.. ఇక కాంగ్రెస్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. బస్మాసుర హస్తంలా ఎక్కడ చేయిపెట్టినా తానే దహించుకుపోవడం ఆ పార్టీకి అలావాటైపోయింది.. పొత్తు లేకపోతే కనీసం డిపాజిట్‌ కూడా రాని దయనీయ స్థితికి చేరుకుంది.. దానికి తోడు  బ్రాహ్మణులను ఆకర్షించేందుకు ఢిల్లీలో చిత్తుగా ఓడి ప్రాభవం కోల్పోయినా వృద్ధనారి షీలాదీక్షిత్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించడంతో ఉన్న కొద్దిపాటి ఆశకూడ ఆవరైంది.. ఇన్ని సానుకూలాంశాల ఉండటంతో ఇప్పుడు గెలవకపోతే ఎప్పటికి గెలవలేం అని బీజేపీ విశ్వసిస్తుంది. అందుకే ఆర్సెస్సె అగ్రనాయకులతో సుదీర్ఘమంతనాలు జరిపి పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తుంది… బీహార్‌ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాలు సిద్ధ చేయడం కొసమెరుపు…
 
 

Leave a Reply