Monday, September 20, 2021
HomeEntertainmentCinema Latestఈ సంవత్సరం అతి పెద్ద డిజాస్టర్‌

ఈ సంవత్సరం అతి పెద్ద డిజాస్టర్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ క్లాసిక్‌ చిత్రాల్లో ‘లేడీస్‌ టైలర్‌’ ఒకటి. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విభిన్న కథాంశంతో, ప్రేక్షకులను ఆకట్టుకునే కథనంతో ఆ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’ చిత్రం వచ్చింది. ఈ సంవత్సరంలో అతి పెద్ద డిజాస్టర్స్‌ జాబితాలో ‘ఫ్యాషన్‌ డిజైనర్‌’ చేరింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఫలితం ఏంటో తేలిపోయింది. దాదాపు 10 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను మధుర శ్రీధర్‌ నిర్మించినట్లుగా తెలుస్తోంది.

చిత్ర పెట్టుబడిలో కనీసం 10 శాతం కూడా కలెక్షన్స్‌ వచ్చే పరిస్థితి లేదు. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మధుర శ్రీధర్‌ స్వయంగా పలు ఏరియాల్లో విడుదల చేయడం జరిగింది. దాంతో మధుర శ్రీధర్‌కు కోలుకోలేని నష్టం వచ్చినట్లుగా ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. డిజాస్ట్రర్‌గా  మిగిలిన ఈ సినిమాతో వంశీ ఇక సినిమాలకు గుడ్‌ బై చెబితే బాగుంటుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతుంది.

- Advertisment -
spot_img

Most Popular