వేలకోట్ల ఆస్తులు ..కదులుతున్న పీఠాలు

 thosand crores money govt shacking
నయీం కేసు ఎంక్వైరీలో ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. గోవా కేంద్రంగా నయీం డెన్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే నయీం అనుచరుడిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు నయీం ప్రధాన అనుచరుడు రియాజ్ అలియాస్ రియాజుద్దీన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతని నుంచి 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రియాజ్ ను అతని స్వస్థలం నల్లగొండ పట్టణానికి తీసుకువెళ్లి విచారిస్తున్నారు పోలీసులు. కోర్టు అనుమతితో నయీం నివాసమున్న ఇంటి రెండో అంతస్తులో.. పోలీసులు, రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

సోదాల్లో కీలక ప్రతాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వనస్థలిపురంలో నయీమ్ అనుచరుడు శ్రీధర్ గౌడ్ ఉంటున్న ఇళ్లు.. నయీమ్ అక్క కూతురు సాజీద్ సాహీమ్ పేరుపై ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నయీం కేసును పూర్తిస్థాయిలో విచారిస్తున్న పోలీసులు.. ఏడు బృందాలుగా ఏర్పడి.. మూడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.నయీం డెన్‌లో పోలీసులు వందలాది డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొంత మంది పోలీసు అధికారులు, రాజకీయ నాయకులకు సంబందించిన వివరాలు లభించాయని సమాచారం.

డీఎస్పీ ఆపై స్థాయి, సినీ, రాజకీయ ప్రముఖుల బంధువులు స్థిరాస్తులకు సంబందించిన పత్రాలు దొరికాయి. హైదరబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండ, ఏపీలో గుంటూరు జిల్లా చినకాకాని, నర్సరావుపేట తదితర ప్రాంతాలకు సంబందించిన కీలక పత్రాలు లభించాయి.నయీం బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో భూములకు సంబంధించిన 400 డాక్యుమెంట్లు, లక్షల్లో నగదు, కంట్రీ మేడ్‌ తుపాకులు, జిలిటెన్‌స్టిక్‌, లైవ్‌ రౌండ్స్‌ పోలీసులకు లభమయ్యాయి. డాక్యుమెంట్లన్నీ బంధువర్గంలోని మహిళల పేర్లతోనే రిజిసే్ట్రషన్‌ చేయించాడు. విచారణ సమయంలో దొరక్కుండా ఉండేందుకే ఇలా చేశాడని సమాచారం.

SHARE