మూడు జెండాలు ఎందుకు పెట్టారు..?

0
290
three flags put on devineni nehru dead body

Posted [relativedate]

three flags put on devineni nehru dead bodyదివంగత టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ విజయవాడలో ముగిశాయి. అయితే ఆయన పార్థివదేహంపై పెట్టిన మూడు జెండాలు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించాయి. సాధారణంగా పదవుల్లో లేని పార్టీ నేతలకు పార్టీ జెండా మాత్రమే పెడతారు. కానీ దేవినేని నెహ్రూకు పెట్టిన మూడు జెండాలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. మూడు జెండాలంటే మూడు పార్టీల జెండాలు మాత్రం కాదులెండి. జాతీయ జెండా, టీడీపీ జెండా, యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ జెండా. ఈ మూడు జెండాల వెనుక చాలా పెద్ద కథే ఉంది.

ముందుగా జాతీయ జెండా గురించి మాట్లాడుకుంటే.. ఎవరి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగినా.. ఈ జెండా పెడతారు. దేవినేని నెహ్రూ అంతిమ సంస్కారాన్ని ఏపీ సర్కారు అధికార లాంఛనాలతో చేసింది. అందుకే జాతీయ జెండా పెట్టారు. ఇక టీడీపీ జెండా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న దేవినేని నెహ్రూ.. ఎన్టీఆర్, చంద్రబాబుతో సన్నిహితంగా పనిచేశారు. అలాంటప్పుడు పార్టీ జెండా పెట్టి తీరాల్సిందే. అందుకే రెండో జెండాగా టీడీపీ జెండా కనిపించింది.

ఇప్పుడు యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ జెండా గురించి చెప్పుకోవాలి. అసలు యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ గురించి బెజవాడ మినహా మిగతా ప్రాంతాల్లో పెద్దగా తెలియదు. కానీ దేవినేని నెహ్రూ ప్రస్థానంలో ఇదే కీలకం. ఈ ఆర్గనైజేషన్ తోనే నెహ్రూ స్టూడెంట్స్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అలాగే ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించి టీడీపీలోకి వచ్చారు. నెహ్రూ పార్టీలు మారినా.. ఆయన స్థాపించిన యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్.. కొండంత అండగా ఉండేది. ఆ బలంతోనే సక్సెస్ ఫుల్ లీడరయ్యారు నెహ్రూ. అందుకే మూడో జెండాగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ జెండా కనిపించింది.

Leave a Reply