కేసీఆర్ త‌ర్వాత నెంబ‌ర్-2గా తుమ్మ‌ల‌?

0
1187
thummala became number two in trs

Posted [relativedate]

 thummala became number two in trs
టీఆర్ఎస్ లో కేసీఆర్ త‌ర్వాత ఆ స్థాయి నాయ‌కుడు ఎవ‌రూ లేరు. అంత‌గా పార్టీపై ఆయ‌న‌కు ప‌ట్టుంది. కేసీఆర్ త‌ర్వాత పార్టీలో ఆస్థాయిలో గుర్తింపు ఉన్న నాయ‌కుడు పేరు చెప్ప‌మంటే… కేటీఆర్ లేదా హ‌రీశ్ అని చెబుతారు. వార‌స‌త్వంగా వారికి ఆ గుర్తింపు వ‌చ్చింది కానీ నిజంగానే పార్టీలో నెంబ‌ర్-2 ఎవ‌రంటే మాత్రం ఇన్నాళ్లూ స‌మాధానం లేదు. కేటీఆర్ మాట‌ల్లో చెప్పాలంటే టీఆర్ఎస్ లో నెంబ‌ర్ వ‌న్ ఒక్క‌రే. ఆ త‌ర్వాతి నెంబ‌ర్లు కూడా కేసీఆరే త‌ప్ప మ‌రొక‌రికి అవ‌కాశం లేదు. ఎందుకంటే పార్టీని న‌డిపించే స‌మ్మోహ‌న శ‌క్తి ఒక్క కేసీఆరే. అందులో ఎవ‌రికీ ఎలాంటి డౌటు అవ‌స‌రం లేదు కూడా.

ఒక‌ప్పుడు టీడీపీలో కేసీఆర్ కు క్లోజ్ ఫ్రెండ్ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు. ఆ త‌ర్వాత కేసీఆర్ పార్టీ మారి.. టీఆర్ఎస్ పెట్టిన‌ప్ప‌టికీ ఇద్ద‌రి మ‌ధ్య స్నేహానికి ఎలాంటి అడ్డంకి రాలేదు. పార్టీలు వేరైన‌ప్ప‌టికీ అనుబంధం కొన‌సాగింది. తుమ్మ‌ల టీఆర్ఎస్ లో చేరిన త‌ర్వాత గానీ ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఇక తుమ్మ‌ల టీఆర్ఎస్ లో చేర‌డం, మంత్రి అయిపోవ‌డం.. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ… అనంత‌రం ఎమ్మెల్యేగా ఎన్నిక‌.. ఇలా టీఆర్ఎస్ లో చేరిక‌.. ఆయ‌న‌ రాజ‌కీయ గ‌మ‌నాన్నే మార్చేసింది. ప్ర‌స్తుతం తెలంగాణ కేబినెట్ లో కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితులెవ‌రంటే ముందుగా చెప్పేది తుమ్మ‌ల పేరునే. అంత‌గా వీరిద్ద‌రి క్లోజ్ రిలేష‌న్ ఉంది. ఇద్ద‌రు డిప్యూటీ సీఎంల వ‌ల్ల కానిది … తుమ్మ‌ల‌తో అయిపోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు కూడా కేసీఆర్… తుమ్మ‌ల‌ను సంప్ర‌దిస్తార‌ట‌. ఆయ‌న అభిప్రాయం తీసుకున్నాకే.. తుది నిర్ణ‌యానికి వ‌స్తార‌ని టాక్.

కేసీఆర్ కు ఇంత జిగ్రీ దోస్త్ కాబ‌ట్టే ఇప్పుడు తుమ్మ‌ల‌… అటు ప్ర‌భుత్వంలోనూ.. ఇటు పార్టీలోనూ కీల‌కంగా మారారు. హ‌రీశ్ రావు, కేటీఆర్ ను మిన‌హాయిస్తే.. కేసీఆర్ త‌ర్వాత నెంబ‌ర్-2 నాయ‌కుడు తుమ్మ‌ల మాత్ర‌మేన‌ని స‌మాచారం. తుమ్మ‌ల కూడా దాన్ని నిల‌బెట్టుకునేందుకు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. త‌న‌కు వ‌చ్చిన గుర్తింపును కాపాడుకునేందుకు …చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నార‌ట‌.

Leave a Reply