Posted [relativedate]
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనకు సంబంధం ఉన్నా లేకున్నా అన్ని విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు. అయితే ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేయను అంటూ తన తల్లిపై ఒట్టు పెట్టిన విషయం తెల్సిందే. ఈయన ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడనే విషయంపై చర్చ జరుగుతున్న సమయంలోనే బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ భార్య, యువ హీరో టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
కొన్ని రోజుల క్రితం టైగర్ ష్రాఫ్ గురించి వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ట్రాన్స్ జెండర్‌లా టైగర్ కనిపిస్తున్నాడని, ఒక హీరోకు ఉండాల్సిన లక్షణాలు టైగర్‌లో లేవు అంటూ ఎద్దేవా చేశాడు. అప్పుడు వర్మ ట్వీట్స్‌పై తీవ్ర స్థాయిలో బాలీవుడ్లో దుమారం రేగింది. ఒక స్టార్ నటుడి కుమారుడి గురించి వర్మ అలాంటి వ్యాఖ్యలేనా చేసేది అంటూ వర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా తన కొడుకుపై వర్మ చేసిన వాఖ్యలకు అయేషా ష్రాఫ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వర్మ ఒక వీది కుక్కలా మొరుగుతున్నాడు, ఆయన కూతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఆమె పేర్కొంది. వర్మను ఈ స్థాయిలో ఎంతో మంది విమర్శించారు. అయితే ఒక హీరో తల్లి ఇలా స్పందించడంతో చర్చనీయాంశం అయ్యింది. వర్మ ఇక ఇలాంటి తిట్లు వద్దనుకుని తన వివాదాస్పద వ్యాఖ్యలకు ఫుల్స్టాప్ పెట్టాడేమో అని కొందరు అంటున్నారు.