అది వాడితే జర్నలిస్ట్ కి జైల్..ఓ ఛానల్ వార్నింగ్

Posted April 18, 2017

Times Group sends legal notice to Arnab goswami
టీవీ ఛానెల్స్ లో పనిచేసే ఉద్యోగులు అటుఇటు మారడం కొత్తేమీ కాదు.అందులో ఏ వింత లేదు. కానీ కొద్దిగా పేరున్న జర్నలిస్ట్ అంటే ఓ విధంగా చెప్పాలంటే బుల్లితెర మీద తరచుగా కనిపించే జర్నలిస్ట్ ఛానల్ మారితే అది కాస్త జనాల్లో చర్చకి దారి తీస్తుంది.కానీ ఉద్యోగం మారిన జర్నలిస్ట్ ని ఓ మాట వాడితే జైలుకి పంపుతామని ఓ ఛానల్ వార్నింగ్ ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి.అలా లీగల్ నోటీసు ఇచ్చింది మీడియా దిగ్గజాల్లో ఒకటైన టైమ్స్ గ్రూప్ అయితే ,అది అందుకుంది ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి.ఇంతకీ ఆ ఇద్దరి మధ్య ఇంత రచ్చకి దారి తీసిన మాట ” నేషన్ వాంట్స్ టు నో”..

టైమ్స్ నౌ లో అర్ణబ్ గోస్వామి న్యూస్ డిస్కషన్ ప్రోగ్రాం ఎంత పెద్ద హిట్ అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మోడీ భక్తుడిగా ఆయన్ని కొందరు విమర్శించినప్పటికీ ఓ జర్నలిస్ట్ గా ప్రేక్షకుల్ని తన వైపు దృష్టి పెట్టేలా చేయడంలో గోస్వామి సక్సెస్ అయ్యాడు.ఆ ఇమేజ్ తోడుగా రిపబ్లిక్ టీవీ స్థాపన కోసం టైమ్స్ నుంచి ఆయన బయటికి వచ్చిన విషయం తెలిసిందే.అప్పటినుంచి టైమ్స్ నౌ లో ప్రైమ్ టైం రేటింగ్ పడిపోయింది.అదే టైం లో రిపబ్లిక్ టీవిలో గోస్వామి కనపడతాడని తేలిపోయింది.అయితే అర్ణబ్ ని ఫేమస్ చేసిన “నేషన్ వాంట్స్ టు నో” అన్న మాట వాడితే జైలుకి వెళ్లాల్సి వస్తుందని టైమ్స్ గ్రూప్ ఆయనకి లీగల్ నోటీస్ పంపడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.ఏదైనా మాట మీద ఛానల్ కి హక్కులు ఉంటాయా? ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గోస్వామి ఆ ఛానల్ ని తూర్పారబడుతూ యూట్యూబ్ ఛానల్ లో పెట్టిన కౌంటర్ వైరల్ అవుతోంది.ఆ మాట నేను వాడుతా..మీకు దమ్ముంటే నన్ను జైల్లో పెట్టించండి అని గోస్వామి టైమ్స్ గ్రూప్ కి సవాల్ విసురుతున్నాడు.ఇలా ఓ జర్నలిస్ట్,ఛానల్ గొడవ బయటికి రావడం ఇదే మొదలు కావడంతో అందరి దృష్టి అటు వైపే వెళుతోంది.

SHARE