సరదాగా బోటులో షికారుకు వెళ్లిన కొందరికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. సైట్ సీయింగ్ కోసమని ఆస్ట్రేలియ సముద్రంలో బయలు దేరిన వీరి బోట్ పక్కనే భారీ తిమింగలం సముద్రంలోని నీటిపైన ఎగిరింది. ఆ సమయంలో టూరిస్టుల బోటు కొంత దూరంలో ఉంది. ఈ దృశ్యాన్ని జాన్(52) అనే వైల్డ్ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. తిమింగలం బోటుకు పక్కలో ఎగిరిన సమయంలో అందులోని టూరిస్టులంతో మరోవైపు చూస్తున్నారని తిమింగలాన్ని గమనించలేదని ఫోటోగ్రాఫర్ తెలిపాడు. అయితే ఆస్ట్రేలియా సముద్రంలో తరుచూ ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయని చెప్పిన ఆయన ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ భారీ తిమింగలాలకు బలైపోక తప్పదని చెప్పాడు.
ప్రతి సంవత్సరం అంటార్టికా నుంచి ఈ భారీ తిమింగలాలు ఆస్ట్రేలియా సముద్రంలోకి వలస వస్తుంటాయని జాన్ వివరించాడు. అంటార్టికాలో చల్లదనం తట్టుకోలేక ఈ 50 టన్నుల భారీ తిమింగలాలు ఆస్ట్రేలియా సముద్రంలోకి వలస వస్తుంటాయని… జూన్ ఆగష్టు నెలల మధ్య బుజ్జి తిమింగలాలకు జన్మనిచ్చేందుకు తరలి వస్తుంటాయని జాన్ వెల్లడించాడు. తను ఫోటో తీసిన తిమింగలం బోటుకంటే పెద్దదిగాను.. బరువుగాను ఉంటుందని చెప్పాడు జాన్.