కన్నెర్ర జేసిన తిరుమల శ్రీవారు!!

0
904
tirumala venkanna angry

Posted [relativedate]

tirumala venkanna angry
కలియుగ ప్రత్యక్షదైవంగా తిరుమల శ్రీనివాసుడి ఖ్యాతి జగద్విఖ్యాతం. వెంకటేశ్వర స్వామి మహిమలు అమోఘమని భక్తుల నమ్మకం. కోరిన కోర్కెలు తీర్చే స్వామి వారికి ఆగ్రహం రాకుండా భక్తులు నడుచుకుంటారు. ఎందుకంటే తిరుమలేశుడు కన్నెర్ర చేస్తే అంతేనని చెబుతారు. అన్నాడీఎంకే శేఖర్ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగిందని ప్రచారం జరుగుతోంది.

శ్రీవారి ఆలయంలో బంగారు తలుపుగా అంద విహీనంగా తయారయ్యాయి. వాటికి కొత్త బంగారు పూత వేయించేందుకు టీటీడీ జువెలరీ అధికారులు 86.70 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. అంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసేందుకు శేఖర్ రెడ్డి స్వయంగా ముందుకొచ్చారట. దీనిపై పాలకమండలం సమావేశంలోనూ నిర్ణయం జరిగింది. అయితే నల్లశేఖరుడి గురించి స్వామి వారికి ముందే తెలిసినట్టుంది. ఎందుకనో ఆ పని పట్టాలెక్కలేదు. మరోసారి ఈ వ్యవహారం చర్చకు వచ్చిందట. అంతా రెడీ అనుకుంటున్న తరుణంలో ఇలా జరిగిందని ప్రచారం జరుగుతోంది. అవినీతి మకిలీతో తనకు విరాళం ఇస్తే స్వామి ఒప్పుకోరట. నల్ల శేఖరుడిపై అందుకే శ్రీవారికి కోపం వచ్చిందట. అందుకే స్వామి వారు కన్నెర్ర జేశారట. అందులో భాగంగానే నల్లశేఖరుడి వ్యవహారం బట్ట బయలైందని భక్తులు చెబుతున్నారు. తిరుమలేశుడితో పెట్టుకుంటే అంతేనని ఇంతకు ముందు జరిగిన సంఘటనలను ఉదహరిస్తున్నారు.

గాలి జనార్థన్‌ రెడ్డి అప్పట్లో కోట్ల విలువైన వజ్ర కిరీటాన్ని స్వామికి సమర్పించారు. ఆ తర్వాత ఆయన జైలుపాలయ్యారు. జనార్థన్‌ రెడ్డి సమర్పించిన కిరీటాన్ని తితిదే స్వీకరించడంపైన కొందరు విమర్శలు చేశారు. అయితే అదంతా స్వామి వారు చూసుకుంటారు.. మేము మాత్రం కానుకలు తీసుకుంటామంటూ టీటీడీ కవర్ చేసుకుంది. కానీ ఆ తర్వాత అదే జరిగింది. స్వామి వారి ఆగ్రహానికి గాలి బలైపోయారని భక్తులు చెబుతుంటారు. అందుకే అవినీతి వ్యవహారాలు చేసే వారు తిరుమలేశుడి విషయంలో జాగ్రత్త పాటించాలంటున్నారు భక్తులు. అనవసరంగా లేనిపోనివి చేసి శ్రీవారి ఆగ్రహానికి గురి కావొద్దని హితవు పలుకుతున్నారు.

Leave a Reply