వెండి డాలర్లపై శ్రీవారు…

0
906

 tirupathi devastanam venkateswara swamy dollar

భక్తుల కోసం శ్రీవేంకటేశ్వర స్వామి, అలుమేలు మంగమ్మ ప్రతిమలతో వెండి డాలర్లను తయారు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. 5, 10 గ్రాములతో రెండు రకాలైన డాలర్లను తయారు చేస్తారు. ఇందుకోసం టిటిడి రూ.5.5కోట్ల రూపాయలను కేటాయించారు.  భక్తులు సమర్పించిన తలనీలాలను ఈ-విక్రయాల ద్వారా జరిగిన విక్రయంతో మే మాసంలో 7.92 కోట్ల రూపాయలు, జూన్ 7.42 కోట్ల రూపాయల ఆదాయం లభించిందన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ద్వారక తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర వికలాంగుల పునరావాస సంస్థకు 10 కోట్ల రూపాయలు మూలనిధి ఇవ్వాలని ధర్మకర్తల మండలి నిర్ణయించినట్లు టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వీరభద్రాపురం గ్రామంలోని శ్రీవీరేశ్వరి ఆలయం మరమ్మతులకు 25 లక్షల రూపాయలు నిధులు కేటాయించామన్నారు. తిరుపతి రాయలచెరువు ప్రాంతంలో 32లక్షల వ్యయంతో 46 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించామన్నారు.

గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయానికి 31.25 లక్షలతో నూతన మహారథాన్ని తయారు చేసేందుకు నిర్ణయించామన్నారు. కడప జిల్లా బద్వేలు మండలం చెన్నంపల్లి గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయానికి 31.25 లక్షలతో మహారథాన్ని తయారు చేయించనున్నట్లు తెలిపారు. 2017 నూతన సంవత్సరానికి 12 పేజీలు కలిగిన క్యాలెండర్లను 18లక్షలు ముద్రించేందుకు ఆమోదం తెలిపామన్నారు. టిటిడి ప్రచురణలు విక్రయించే పుస్తకాలు, సీడీలు, భారతం, భాగవతం గ్రంథాలు డిస్కౌంట్ పద్ధతిలో నిరంతరం విక్రయించాలని నిర్ణయించారు.

Leave a Reply