టీజేఏసీలో లుక‌లుక‌ల వెన‌క టీఆర్ఎస్?

Posted [relativedate]

TJAC leaders and pittala ravinder comments on kodandaram
తెలంగాణ సాధ‌న‌లో కీల‌క‌పాత్ర పోషించిన టీజేఏసీలో ఇప్పుడు లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి.ఏకంగా జేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రామ్ పైనే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు ఆయ‌న స‌హ‌చ‌రులు. ఆయ‌న వ్య‌క్తిగ‌త ఎజెండాను అమ‌లు చేస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. జేఏసీ నేత పిట్ట‌ల ర‌వీంద‌ర్ తో పాటు ప‌లువురు జిల్లాల జేఏసీ నాయ‌కులు… ఆయ‌నపై తిరుగుబాటు జెండా ఎగుర‌వేశారు.

టీజేఏసీలో ఇంట‌ర్న‌ల్ వార్ వెనుక అదృశ్య‌హ‌స్త‌ముంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఒక రాజ‌కీయ పార్టీ జేఏసీలో చీలిక తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీయే ఇదంతా చేయిస్తోంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎందుకంటే గ‌త కొంత‌కాలంగా కోదండ‌రామ్ ప్ర‌భుత్వ తీరును తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. ప్ర‌తిప‌క్షాల కంటే కూడా… కోదండ‌రామ్ ఎక్కువ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటీవ‌ల నిరుద్యోగుల స‌భ‌తో ఆయ‌నకు వ్య‌క్తిగ‌తంగా మంచి మైలేజ్ వ‌చ్చింది. అయితే పాపులారిటీని పెంచుకుంటూ రాజ‌కీయ పార్టీ పెట్టే దిశ‌గా ముందుకెళ్తున్న కోదండ‌రామ్ కు బ్రేకులేసేందుకు అధికార పార్టీ విభ‌జించు.. పాలించు సూత్రాన్ని ఫాలో అవుతోంద‌ని ఆయ‌న వ‌ర్గం ఆరోపిస్తోంది. జేఏసీలో తిరుగుబాటు వెనుక అదే కార‌ణ‌మ‌ని విమ‌ర్శిస్తోంది.

కోదండ‌రామ్ పై తిరుగుబాటు చేసే నాయ‌కుల‌కు … టీఆర్ఎస్ ఆఫ‌ర్లు ఇస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కోదండ‌రామ్ ను వీడి వ‌చ్చే జేఏసీ నాయ‌కుల‌కు మంచి ప‌ద‌వులు ఇస్తామ‌ని ఎర వేస్తున్నార‌ట‌. ఈ స‌మ‌యంలో వ‌చ్చే వారికి వెంట‌నే నామినేటెడ్ పోస్టులు ఇచ్చేస్తామంటూ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చేస్తున్నార‌ని టాక్. అందులో భాగంగానే పిట్ట‌ల ర‌వీంద‌ర్ కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఆయ‌న‌కు మంచి ప‌ద‌వి ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని టాక్.

మొత్తానికి కోదండ‌రామ్ ను దెబ్బ‌తీసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద స్కెచ్చే వేసింది. మ‌రి ఇది వ‌ర్క‌వుట్ అవుతుందా.. లేదా అన్న‌ది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here