ఆగస్టు 11న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆకాశంలో మరో అద్భుతాన్ని చూడొచ్చు. ఆకాశం మరింత ప్రకాశవంతం కానుంది. గంటకు సుమారు 200 వరకూ ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించి ఒక్కసారిగా భారీ వెలుగును ఉత్పత్తి చేస్తాయని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సెకనుకు 59 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి ఉల్కలు వచ్చే సమయంలో అడ్డువచ్చే దుమ్ము, ధూళి కణాలను ఢీకొన్నప్పుడు భారీ వెలుగు వస్తుంది.గంటకు 200 ఉల్కల చొప్పున భూవాతావరణాన్ని తాకుతాయన్నారు. 2009లో ఇలాంటి అద్భుతం జరిగిందని, ఇప్పుడు మళ్లీ దీన్ని చూడవచ్చని ఆయన అన్నారు. ప్రతి ఉల్క తోకచుక్కలోని ఒక చిన్న భాగం
సూర్యుడి కక్ష్యలో 133 ఏళ్లకోసారి తిరిగే తోకచుక్క సౌర వ్యవస్థలో ట్రిలియన్లకొద్దీ ముక్కలను వదిలేస్తుందని.. ఈ ముక్కలు భూ వాతావరణాన్ని తాకినప్పుడు పెద్ద ఎత్తున వెలుగు వర్షం కురుస్తుందన్నారు. ఉల్కలు సెకన్‌కు 59కిలోమీటర్ల వేగంతా విస్తరిస్తూ వెళ్లనున్నాయి అవి భూవాతావరణాన్ని తగిలినప్పుడు 1600 నుంచి 5500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడుతుందని, భూపరితలంపై 80 కిలోమీటర్ల మేర మండుతుందని దానివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా వెల్లడించింది.