విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ‘తొలిప్రేమ‌లో’..

0
436

  tolipremalo movie ready to release

నూత‌న నిర్మాణ సంస్థ యాదాద్రి ఎంట‌ర్ టైన్మెంట్స్ తొలి ప్ర‌య‌త్నంగా త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `క‌య‌ల్` చిత్రాన్ని `తొలిప్రేమ‌లో` అనే పేరుతో తెలుగులోకి విడుద‌ల చేస్తున్నారు. ప్రేమ‌ఖైదీ, గ‌జ‌రాజు వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప్ర‌భుసాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో గౌళీకార్ శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో త‌మ‌టం శ్రీనివాస్‌, జ‌యార‌పు రామ‌కృష్ణ నిర్మాత‌లుగా ఈ సినిమా రూపొందుతుంది. చంద్ర‌న్‌, ఆనందిని, ప్ర‌భు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు.

స్వ‌చ్చ‌మైన ప్రేమ‌క‌థ‌తో రూపొందిన ఈ చిత్రం త‌మిళంలో మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఈ చిత్రానికి శ‌శాంక్ వెన్నెల‌కంటి మాట‌లు, చంద్ర‌బోస్‌, శివ‌గ‌ణేష్‌, పెద్దాడ శ్రీరామ‌మూర్తి పాటలు అందిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందించారు. వెట్రివేట్ మ‌హేంద్ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమా ఎంతో క‌ష్ట‌ప‌డి క్లిష్ట‌మైన లోకేష‌న్స్ అయిన మ‌నాలి, చిరపుంజి, మేఘాల‌యాల్లో ఎన్నోవ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి చిత్రీక‌ర‌ణ‌ను జ‌రిపారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌కుడు రాజ‌మౌళి `బాహుబ‌లి` కోసం కొన్ని స‌న్నివేశాల‌ను అక్క‌డే చిత్రీక‌రించ‌డం విశేషం. త్వ‌ర‌లోనే ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు.

Leave a Reply