సమ్మర్ రాకముందే టాలీవుడ్ లో హీట్ స్టార్ట్…

0
270
tollywood back to back summer movies

 Posted [relativedate]tollywood back to back summer movies

సమ్మర్ రాకముందే టాలీవుడ్ లో హీట్ ని పెంచేస్తోంది సమ్మర్ సినిమాల బిజినెస్. ఈ సమ్మర్ లో రిలీజయ్యే భారీ సినిమల నుండి చిన్నా చితకా సినిమాల దాకా టోటల్ బిజినెస్ టార్గెట్ 700కోట్లుగా అంచానా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.  

ఈ సమ్మర్ హీట్ ముందు మెగా కాంపౌండ్ తోనే మొదలుకానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయడుతో రిబ్బన్ కటింగ్ అయ్యి మహేష్ బాబు సినిమాతో గుమ్మడికాయ కొట్టనుంది.  పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం కనీసం 100 కోట్ల వసూళ్లను సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా చేశాడు నిర్మాత శరత్ మరార్. ఇదే నెలలో 29న శర్వానంద్ నటించిన రాధా  సినిమా రానుంది. ఎక్స్ ప్రెస్ రాజా,  శతమానం భవతి సినిమాలతో వరుస విజయాలతో ఉన్న శర్వా నటించిన చిత్ర కావడంతో రాధా సినిమాపై కూడా అంచానాలు ఉన్నాయి.

ఇక వచ్చే నెల 7వ తేదీన వెంకటేష్ నటించిన గురు,  మణిరత్నం మూవీ చెలియా కూడా విడుదల కానున్నాయి. చెలియా డబ్బింగ్ సినిమానే అయినా మణిరత్నం దర్శకత్వం వహించడం,  దిల్ రాజు రిలీజ్ చేస్తుండడంతో  చెలియా మీద  కూడా భారీగా బిజినెస్ జరుగుతోంది. అదే డేట్ కి అల్లు శిరీష్ నటించిన మలయాళ చిత్రం 1971 బెయాండ్ బోర్డర్స్ కు తెలుగు డబ్బింగ్ వెర్షన్ అయిన 1971 భారత సరిహద్దు కూడా విడుదల కానుంది. ఆ తర్వాత  శ్రీనువైట్ల దర్శకత్వంలో  వరుణ్ తేజ్ నటించిన  మిస్టర్ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇక  ఆ తర్వాత అసలుసిసలైన సినిమా బాహుబలి-2 పేరుతో  ఏప్రిల్ 28న రంగంలోకి దిగుతుంది. ఈ మూవీ ఒక్కటే 400 కోట్ల వ్యాపారం చేయనుందనే అంచనాలున్నాయి. బాహుబలి- 2 తర్వాత మే 12న నిఖిల్ నటించిన కేశవ,  మే 19వ తేదీన అల్లు అర్జున్ యాక్ట్ చేసిన దువ్వాడ జగన్నాధం రిలీజ్ కానున్నాయి. కేశవ మీద ఓ మోస్తరు అంచాలున్నా, బన్నీ  చిత్రం మాత్రం 80 కోట్లమేర వ్యాపారం చేయనుందని అంచనా. మరి డీజే ఏం చేస్తాడో.

ఇక జూన్ 24న మురగదాస్ కాంబినేషన్ లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఏ ఒక్క న్యూస్ బయటకు రాకపోయినా మహేష్ అనే బ్రాండ్ ఉండడంతో సినిమా  మార్మోగిపోతోంది. మరి ఇన్ని భారీ బడ్జెట్ సినిమాలు, వరుస హిట్స్ అందుకుంటున్న చిన్న హీరోల సినిమాలు అన్ని కలిసి టాలీవుడ్ ట్రేడ్ ని ఏ రేంజ్ కి తీసుకెళ్తాయో చూడాలి.

Leave a Reply