ఆ హీరో దగ్గర 125 కోట్ల బ్లాక్ మని..!

Posted November 14, 2016

Tollywood Hero 125 Crores Black Moneyప్రధాని నరేంద్ర మోది ఇచ్చిన నోట్ల రద్దు షాక్ కు పొలిటికల్ లీడర్స్ కే కాదు సిని నిర్మాతలు, హీరోలకు గట్టి దెబ్బే తగిలింది. ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో దగ్గర ఏకంగా 125 కోట్ల డబ్బు అది 500, 1000 రూపాయల నోట్లతో ఉన్నాయట. ప్రధాని ప్రవేశ పెట్టిన నల్లధన నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 500, 1000 నోట్లను రద్దు చేయడం ఉన్న డబ్బంతా బ్యాంకుల్లో వేసుకోండని చెప్పడంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి అయ్యిందట ఈ హీరోది.

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో అంత ఎమౌంట్ అది కూడా బ్లాక్ మని కావడంతో ఎలా దీన్ని వైట్ మనీగా మార్చాలని తర్జన భర్జన పడుతున్నాడట. ఈ క్రమంలోనే చెన్నై, బెంగళూరులో తనకి తెలిసిన వారికి ఫోన్ చేసి విషయం పై చర్చలు జరుపుతున్నాడట. అయితే హీరో దగ్గర అంత ఎమౌంట్ ఎందుకు ఉంది.. అసలు అంత ఎమౌంట్ అది కూడా బ్లాక్ మనీ ఎలా వచ్చింది అన్న వాటి మీద ఆరా తీస్తున్నారు.

ఏది ఏమైనా ఇప్పటి దాకా సాగిన బ్లాక్ మనీ ఆటలు ఇక నుండి సాగవన్నది తేలింది. హీరో గారు ఆ ఎమౌంట్ ను వైట్ మనీగా మార్చాలనుకునే క్రమంలో తన పేరు బయట పడకుండా ఉండాలని చూస్తున్నారు. అది ఎప్పటికి జరుగుతుందో ఏమో చూడాలి.

SHARE