డ్ర‌గ్స్ రాకెట్లో టాలీవుడ్ హీరో!!

0
484
tollywood hero in drugs rocket

Posted [relativedate]

tollywood hero in drugs rocket
డ్ర‌గ్స్ దందాతో టాలీవుడ్ లింకులు బ‌య‌ట‌ప‌డడం కొత్తేమీ కాదు. ఎప్ప‌టిక‌ప్పుడు నిందితులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నా…ఈ దందాకు మాత్రం అడ్డుకట్ట ప‌డ‌డ‌డం లేదు. తాజాగా ఏకంగా ఓ టాలీవుడ్ హీరోనే డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తూ అడ్డంగా బుక్క‌య్యాడు. ఈ హీరో ఎవ‌రో కాదు… “ఐతే” సినిమాలో హీరోగా న‌టించిన అభిషేక్.

అభిషేక్ “ఐతే” సినిమాలో హీరోగా న‌టించిన త‌ర్వాత ఒక‌టి, రెండు సినిమాల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. అవకాశాలు రాకపోకడం, ఆర్థిక కార‌ణాల‌తో త‌ప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇత‌ను చాలా ఏళ్లుగా డ్ర‌గ్స్ దందా చేస్తున్నాడ‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో ఓ బ‌డా హీరో సోద‌రులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన‌ప్పుడు ఆ స్పాట్ లో ఇత‌ను కూడా ఉన్నాడ‌ట‌. కానీ చివ‌రి నిమిషంలో త‌ప్పించుకున్నాడ‌ని టాక్. ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాలు మారుస్తూ ఇత‌ను తెలివిగా దందా చేస్తూ.. బాగానే ఆర్జించాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అభిషేక్ సినిమాల ద్వారా సంపాదించిన దానికంటే చాలా ఎక్కువ ఆదాయం… డ్ర‌గ్స్ ద్వారా ఆర్జించాడ‌ని స‌మాచారం. హైద‌రాబాద్ లో చ‌ద‌వ‌డానికి వ‌చ్చి డ్ర‌గ్స్ దందా చేస్తున్న‌కొంత‌మంది నైజీరియ‌న్ యువ‌కుల‌తో ఇత‌నికి మంచి సంబంధాలున్నాయ‌ట‌. వారి ద్వారా హైద‌రాబాద్ కు డ్ర‌గ్స్ ను తీసుకురావ‌డం… దాన్ని ఇత‌రుల‌కు అమ్మ‌డం ఇత‌ని దిన‌చ‌ర్య‌గా మారింద‌ని తెలుస్తోంది. అంతేకాదు కొంత‌మంది టాలీవుడ్ ప్రముఖుల‌కు కూడా అభిషేక్ డ్ర‌గ్స్ స‌ప్ల‌య్ చేస్తాడ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అభిషేక్ తో ఎవ‌రెవ‌రికి లింకులున్నాయ‌న్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే లోప‌లికి వెళ్ల‌డం.. ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చి ఇదే దందా కొన‌సాగించ‌డం ఇత‌నికి అల‌వాటైన ప‌నే. గ‌తంలోనూ ఇత‌ను డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లి వ‌చ్చాడ‌ని తెలుస్తోంది. అయితే ఈసారైనా అత‌ను మార‌తాడ‌ని ఆశించ‌డం కష్ట‌మే. ఎందుకంటే అంత‌గా అత‌ను ఆ దందాలో కూరుకుపోయాడు. ఏదేమైనా ఒక టాలీవుడ్ హీరో ఇలా త‌ప్పుడు ప‌నులు చేస్తూ దొరికిపోవడం… ఇండ‌స్ట్రీవ‌ర్గాల‌ను విస్మ‌యానికి గురిచేసింది. ఎందుకంటే అత‌నితో సంబంధాలున్న చాలా మంది ఇప్పుడు ఈ వార్త విని షాక‌వుతున్నార‌ట‌. చూడ‌డానికి అమాయ‌కుడిలా క‌నిపించే అభిషేక్… ఇంత పెద్ద డ్ర‌గ్స్ స్మ‌గ్ల‌రా… అని ముక్కున వేలేసుకుంటున్నార‌ట‌.

Leave a Reply