ప్రభుదేవాని రిజక్ట్ చేసిన టాలీవుడ్ హీరో.. ఎవరు ?

 Posted October 19, 2016

tollywood hero reject prabhudeva story

కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడిగా కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నాడు ప్రభుదేవా. బాలీవుడ్ బడా స్టార్స్ తో 100కోట్లు కలెక్ట్ చేసే సినిమాలు చేశాడు. ఇప్పుడీ దర్శకుడి దృష్టి మళ్లీ సౌత్ ప పడింది. తెలుగులో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందులు ప్లాన్ చేశాడు. ఈ  క్రమంలోనే ఓ టాలీవుడ్ యంగ్ హీరోకి కథని కూడా వినిపించాడట. తీరా కథ విన్నాక.. కథ నచ్చలేదని సున్నితంగా తిరస్కరించాడట.

ఇప్పుడంతా ప్రభుదేవాని రిజక్ట్ చేసిన ఆ టాలీవుడ్ యంగ్ హీరో ఎవరు ? అని తెగ గింజుకొంటున్నారు. కొందరైతే నాని అయి ఉంటాడని, కాదు.. కాదు రాజ్ తరుణ్, విజయ్ దేవరకొండ.. ఎవరికి తోచిన పేర్లని వారు తలచుకుంటున్నారు. ఇంతకీ.. ఆ టాలీవుడ్ యంగ్ హీరో ఎవరై ఉంటారబ్బా.. ???

ఇదిలావుండగా..ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అభినేత్రి’లో నవ్వించే ప్రయత్నం చేశాడు ప్రభుదేవా.ఈ థ్రిల్లర్ సినిమా కలెక్షన్స్ లోనూ ఫర్వాలేదనిపించింది. అయితే, ప్రభుదేవా మార్క్ కామెడీ, తమన్నా అందాలు చూడ్డానికి ‘అభినేత్రి’ని ఒకటి రెండు సార్లు చూస్తున్నారంట.

SHARE