ఆ టాలీవుడ్‌ హీరోకు ‘బాహుబలి’ దర్శకుడు ఎవరో తెలియదట?

0
592
tollywood hero says nikesha patel i am not knowing bahubali 2 director

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

tollywood hero says nikesha patel i am not knowing bahubali 2 directorప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘బాహుబలి’ ఫీవర్‌ ఏ స్థాయలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లాడి నుండి పండు ముసలి వరకు కూడా ‘బాహుబలి’ గురించి మాట్లాడుకుంటున్నారు. బాహుబలి దర్శకుడు ఎవరు అంటే ఠక్కున ఆలోచించకుండా అంతా కూడా రాజమౌళి పేరు చెబుతారు. కాని ఒక టాలీవుడ్‌ హీరోకు మాత్రం ‘బాహుబలి’ దర్శకుడు ఎవరో తెలియదట. ఆ హీరో ఎవరు అనే విషయంలో క్లారిటీ లేదు, కాని ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

పవన్‌ నటించిన ‘కొమురం పులి’ చిత్రంతో హీరోయిన్‌గా నటించిన నికిషా పటేల్‌ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. తాజాగా ఈమెకు పరిచయం ఉన్న ఒక తెలుగు హీరో కలిశాడట. ఆ సమయంలోనే బాహుబలి సినిమా చూశారా ఆ హీరోను అడిగిందట. అందుకు లేదని సమాధానం చెప్పిన సదరు హీరో, ఆ చిత్ర దర్శకుడు ఎవరు అంటూ ప్రశ్నించాడట. మొదట జోక్‌గా ఆ హీరో అడిగాడు అనుకున్నా, కాని బాహుబలి హీరో ఎవరో ఆ హీరోకు తెలియదు అని తెలిసింది. దేశం గర్వించదగ్గ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గురించి తెలుసుకోక పోవడం ఏంటాని నేను షాక్‌ అయ్యాను. ‘బాహుబలి’ గురించి దేశ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఆ హీరోకు దర్శకుడు ఎవరో తెలియక పోవడం కడు శోచనీయం అని హీరోయిన్‌ నికిషా చెప్పుకొచ్చింది. ఇంతకు ఆ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం తాను చెప్పలేను అంటూ నికిషా సస్పెన్స్‌లో పెట్టింది.

Leave a Reply