మోది దెబ్బకి టాలీవుడ్ స్టార్ హీరో బుక్కయ్యాడు..!

Posted November 10, 2016

am1మోది ప్రవేశ పెట్టిన 500, 1000 రూపాయల నోట్ల రద్దు కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దెబ్బకి ఓ టాలీవుడ్ హీరోకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని జరిగిందట. కొన్ని బిజినెస్ డీలింగ్స్ కోసం ఇంట్లో ఏకంగా 25 కోట్ల బ్లాక్ మని ఉంచాడట ఈ హీరో. తరతరాలుగా పరిశ్రమతో అనుబంధం ఉన్న ఈ హీరో బయట బిజినెస్ లు కూడా బాగానే చేస్తాడు. ఓ బిజినెస్ డీలింగ్ లో భాగంగా ఇంట్లో 25 కోట్ల 1000 రూపాయల నోట్ల కట్టలను ఉంచాడట.

బయటకు తెచ్చేందుకు అవి బ్లాక్ మని కావడంతో ఇప్పుడు ఆ హీరో ఏం చేయాలో తోచని పరిస్థితి అయ్యింది. రెండు రోజుల్లో పేమెంట్ పూర్తయ్యే వీలున్నా మోది కరెక్ట్ టైం లో షాక్ ఇవ్వడంతో దిక్కుతోచట్లేదట. వెంటనే తనకు తెలిసిన ఆడిటర్లందరిని లైన్లోకి తెచ్చి ఆ మనిని ఎలా వైట్ మనిగా మార్చాలనే ఆలోచన చేస్తున్నారట. ఇన్నాళ్లు రాజకీయ నాయకుల దగ్గరే బ్లాక్ మని ఉంది అనుకుంటుంటే ఇప్పుడు హీరోల దగ్గర కూడా నల్లధనం మూలుగుతుందన్నమాట.

కేవలం ఆ హీరో ఒక్కడే కాదు స్టార్ హీరోలందరి దగ్గర దాదాపు బ్లాక్ మని ఉందని టాక్. రెమ్యునరేషన్ లో సగం బ్లాక్ మనిగానే పొందుతున్నారనేది రూమర్. ఏది ఏమైనా మోది షాక్ కు సినిమా వాళ్ళు తడబడుతుందని చెప్పేయొచ్చు.

SHARE