IIFA అవార్డ్స్ మొదటి రోజు సింగపూర్ లో జరిగింది, ఈ అవార్డ్స్ కార్యక్రమానికి వచ్చిన మన టాలీవుడ్ స్టార్స్ సింగపూర్ లో చాలా హంగామా చేసారు.. ఈ కార్యక్రమం అతిరధ మహారదుల సమక్షంలో ఎంతో ఉత్సాహం గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవికి 150 వ చిత్రం నటిస్తున్నందున చిరు కి ‘ఆల్ ది బెస్ట్ మెగాస్టార్’ అంటూ చిరు అభిమానులు హర్షధ్వానాలు వినిపించారు, ఈ హంగామా నడుమ చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. మొత్తానికి ఈ కార్యక్రమంలో చిరంజీవి స్పెషల్ ఆకర్షణగా నిలిచాడు. ..
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్స్ చిరు, అరవింద్, అల్లు అర్జున్, శిరీష్, దేవి శ్రీ ప్రసాద్, వరుణ్ తేజ్, అఖిల్, సుశాంత్, రానా, అలీ , సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు..
ఉత్తమ చిత్రం: బాహుబలి
ఉత్తమ కథానాయకుడు : మహేష్
ఉత్తమ నటి : శృతి హసన్
ఉత్తమ డైరెక్టర్ : రాజమౌళి
ఉత్తమ విలన్ : రానా
ఉత్తమ సపోర్టింగ్ కథానాయక : రమ్య కృష్ణ
ఉత్తమ సపోర్టింగ్ కథానాయకుడు: రాజేంద్ర ప్రసాద్