కేథరిన్ పై అనఫీషియల్ బ్యాన్ ?

 Posted October 20, 2016

 tollywood industry unofficial ban on catherine

మెగా ఛాన్స్ మరో మెట్టు ఎక్కిస్తుందని ఆశపడితే. మొత్తానికే పాతాళానికి తొక్కేసింది. ఈ మేటరు చేతికందిన మెగా ఐటమ్ ని చేజార్చుకొన్న ముద్దుగుమ్మ కేథరిన్ గురించే. మెగా ఐటమ్ నుంచి తప్పించిన తర్వాత కేథరిన్ పరిస్థితి మరీ దారుణంగా మారిందట. టాలీవుడ్ లో కేథరిన్ పై అనఫీషల్ బ్యాన్ పడినట్టేనని చెప్పుకొంటున్నారు.

‘ఇద్ద‌ర‌మ్మాయిల‌తో’ తెలుగు పరిచయమైంది కేథరిన్. టాలెంట్ ఉన్న అమ్మాయి అనిపించుకొంది. పైసా, ఎర్రబస్ చిత్రాలలో నటించింది.రుద్రమదేవిలో ఈ అమ్మాయికి మంచి పాత్ర దక్కింది. ఈ యేడాది బన్ని సరసన నటించిన ‘సరైనోడు’తో కేథరిన్ కెరీర్ సీడందుకొంది. వరుసగా ఆఫర్లు వచ్చిపడ్డాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ ‘ఖైదీ నెం.150’లో ఐటమ్ సాంగ్ ఛాన్స్ తలుపుతట్టింది. తీరా షూటింగ్ లో చిన్న వివాదం చిలికి చిలికి తుపాన్ గా మారింది. చివ‌రికి కేథరిన్ కెరీర్ కే ముప్పొచ్చింది.

మెగా ఖైదీ సెట్స్ కేథరిన్ చేసిన గొడ‌వ టాలీవుడ్ లో వైర‌ల్ అయింది. ఇపుడు కేథరిన్ అంటే దర్శక, నిర్మాత‌లు, హీరోలు భ‌య‌పడిపోతున్నారు.. వీటికితోడు.. గతంలో కొన్ని సినిమాల సెట్స్ మీద కేథరిన్ చేసిన అల్లరిని కొందరు కెలికి మరీ.. పుండుమీద కారం చల్లుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కేథరిన్ పై అనఫీషియల్ బ్యాన్ పడినట్టేననే ప్రచారం జోరుగా సాగుతోంది.

SHARE