నిరాశపర్చిన టాలీవుడ్ బాబులు!!

0
489
tollywood stars had no reaction for ap special status

Posted [relativedate]

tollywood stars had no reaction for ap special status
జల్లికట్టు స్ఫూర్తితో ప్రత్యేక హోదా పోరు నడుస్తున్న తరుణంలో… టాలీవుడ్ నుంచి ఎంతో ఆశించారు ఏపీ జనం. కానీ సినీతారలు మరోసారి నిరాశ పర్చారు. ప్రజలకేమైనా మేం పట్టించుకోమంటూ నిర్లక్ష్యాన్ని చాటుకున్నారు.

టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలు చాలామంది ఈ హోదా పోరుపై స్పందించనే లేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు … కనీసం ట్వీట్ కూడా చేయలేకపోయారు. జల్లికట్టుకు అనుకూలంగా ట్వీట్ చేసిన మహేశ్ నుంచి చాలా ఆశించారు జనం. ఆయన తుస్సుమనిపించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మౌనం దాల్చారు. ఒక్క పవన్ కల్యాణ్ ట్వీట్లతోనే సరిపెట్టారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున … వీళ్లెవరికీ హోదా గోడు పట్టలేదు. చిన్న హీరోలు మాత్రం తమ మద్దతు అంటూ ట్వీట్లు చేసి… మమ అనిపించేశారు.

జనం మాత్రం ఈ బాబుల సినిమాలు చూడాలి. కలెక్షన్ వర్షం కురవాలి. కానీ జనం గోడు మాత్రం వీరికి పట్టదా? పోనీ వీరంతా క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారా… అంటే అదేం లేదు. స్మార్ట్ ఫోన్లు ఎలాగూ ఉన్నాయి… హోదా పోరుకు మద్దతుగా కనీసం ఓ ట్వీట్ చేసినా జనానికి ఎంతో భరోసా వచ్చేది. అది చేయడానికి కూడా బాబులకు చేతులు రాలేదు. పక్కన తమిళనాడులో జల్లికట్టు గురించి ప్రత్యక్షంగా నిరసనలు తెలపడానికి రజినీకాంత్, అజిత్, రెహమాన్ లాంటి వారు ముందుకొచ్చారు. కానీ ఆ స్ఫూర్తి మన టాలీవుడ్ బాబుల్లో కరువైంది. హీరోలే ముందుకు రానప్పుడు పక్క రాష్ట్రాలకు చెందిన హీరోయిన్ల నుంచి మద్దతు ఆశించడం అత్యాశే…. కాబట్టి వాళ్ల నుంచి కూడా స్పందన కరువైంది.

బడాబాబులంతా మొహం చాటేసిన తరుణంలో ఒక్క బాబు మాత్రం చెప్పింది చేశాడు. హోదా పోరులో పాల్గొంటానని చెప్పాడు. అనుకున్నట్టుగానే వైజాగ్ కు వచ్చాడు. ఆ బాబు మరెవరో కాదు సంపూర్ణేశ్ బాబు. హృదయకాలేయంతో వెలుగులోకి వచ్చిన సంపూ…. హోదా పోరుకు మద్దతు తెలపడమే కాదు…మాట ఇచ్చిన ప్రకారమే వైజాగ్ కు వచ్చాడు. అయితే అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో హోదా నిరసనలో పాల్గొనలేకపోయాడు. అయినప్పటికీ ప్రజల దృష్టిలో నిజమైన హీరో అనిపించుకున్నాడు. టాలీవుడ్ బడాబాబుల కంటే తాను చాలా చెటరని నిరూపించుకున్నాడు.!!

Leave a Reply