సినిమాకు కటౌట్ కాదు.. కంటెంట్ ముఖ్యం!!

Posted February 1, 2017

tollywood top heros 100 movieబాలకృష్ణ తన వందో సినిమాను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసి గౌతమీ పుత్ర శాత కర్ణిని చేసిన సగతి తెలిసిందే. ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేసినా, ఎంత పబ్లిసిటీ చేసినా చిరు ఖైదీ ముందు వెలవెలబోయింది. తాజాగా నాగార్జున కూడా తన వందో సినిమాను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడట.

నాగ్ ఇప్పటివరకు 98 సినిమాలను కంప్లీట్ చేశాడని సినీ వర్గాలు అంటున్నాయి. అంటే నాగ్ చేయబోయే రాజుగారి గది-2 99వ సినిమా కాగా ఆ తర్వాత కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బంగార్రాజు’ వందో మూవీ అవుతుందన్నమాట. అయితే నాగ్ మాత్రం బంగార్రాజు తన వందో సినిమా కాదని, తాను గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన సినిమాలు లెక్కలోకి రావని అంటున్నాడు. తన వందో సినిమా విషయంలో తనకు వేరే లెక్కలున్నాయని, ఆ సినిమాను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నానని, వాటిల్లో చైతూ, అఖిల్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాడు.

అయితే టాలీవుడ్ లో పెద్ద హీరోలుగా పేరు ఉన్న వీళ్లు తమతమ వందో సినిమాలను ప్లానింగ్ ప్రకారం గ్రాండ్ గా ఉండే విధంగా లెక్కలు, డేట్స్ చూసుకుని బాగా పబ్లిసిటీ ఇచ్చి రిలీజ్ చేసి హిట్  చేసుకుంటున్నారు. అయితే ఏ లెక్కలు లేకుండా అప్పటి హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణలు పబ్లిసిటీ అనేది లేకుండా, అసలు వందో సినిమా అని తెలియకుండానే మంచి మంచి ఆణిముత్యాల్లాంటి సినిమాలను చేశారు. అలా చేశారు కాబట్టే వాళ్లు టాలీవుడ్ లెజెండ్స్ గా గుర్తింపబడ్డారు. ప్రస్తుత హీరోలు కూడా వందో  సినిమా అనో, కలెక్షన్స్ బాగుండాలనో ఆలోచించకుండా, కటౌట్ల గురించి కాకుండా కంటెంట్ ఉన్న మంచి సినిమాలను చేస్తే… ఆటోమేటిక్ గా అవి హిట్ అయ్యే తీరుతాయి.

 

SHARE