టాలీవుడ్ కి అమరావతి గాలి మళ్లిందా?

 Posted October 24, 2016

Tollywood towards amaravathi
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ని పొగిడేందుకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఎంతగా పోటీ పడ్డారో చూశాం.చంద్రబాబు ఎంత మొత్తుకున్నా ఆంధ్ర,అమరావతి గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.అలాంటిది ఒక్కసారిగా ఏమైందో ఏమో టాలీవుడ్ చిత్ర ప్రముఖులు ఇద్దరు అమరావతి ప్రస్తావన తెచ్చారు.అక్కడ సౌకర్యాలుంటే షూటింగ్ చేస్తామనే దాకా వెళ్లారు.ఆ ఇద్దరు ఆషామాషీ వ్యక్తులేమీ కాదు.
విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన దర్శకరత్న దాసరి తొలుత అమరావతి విషయం మాట్లాడారు.సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణం బాగా చేస్తే అక్కడ షూటింగ్ జరపడానికి అభ్యంతరం లేదని చెప్పారు.బాబుని కలవాలని వున్నా ఈసారి కుదరలేదని తెలిపారు.ఆపని కూడా చేశారు మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ .ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు.రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని బాబుకి చెప్పారు.బాబు కూడా ఖుషీ అయిపోయి ఏపీ లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలతో వస్తే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పారు.ఏమైనా టాలీవుడ్ కి హఠాత్తుగా అమరావతి గాలి మళ్లినట్టుంది.

SHARE