విలన్ గారి హీరో వేషాలు..!

kbs1416ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం హీరోలంతా విలన్స్ గా మారుతుంటే రీసెంట్ గా వచ్చిన ఓ విలన్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. జిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు కబీర్ సింగ్ ఆ సినిమాతో విలన్ గా మంచి మార్కులు కొట్టడంతో వరుస ఆఫర్లను అందుకున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా కబీర్ విలన్ గా చేస్తుండటంతో అతనికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే హెబ్భా పటేల్ లీడ్ రోల్ లో చేస్తున్న ఏంజిల్ సినిమాలో మొదటిసారి పాజిటివ్ రోల్ చేస్తున్నాడట కబీర్.

విలన్ కన్నా సపోర్టింగ్ రోల్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది అంటున్న ఈ నార్త్ స్టార్ కు అనుకోకుండా ఓ నూతన దర్శకుడి సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా రాబోతున్న ఆ సినిమాలో మేల్ లీడ్ గా కబీర్ సెలెక్ట్ అయ్యాడట. సినిమా మొత్తం ఆమె చుట్టూ అల్లుకునేలా ఉన్నా హీరో అనగానే ఓ కొత్త ఉత్సాహం వచ్చింది అంటున్నాడు కబీర్. మరి ఈ హీరో టర్నెడ్ విలన్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

SHARE