సౌత్ లో సూపర్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన నయనతార కొద్దిరోజులుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమ ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదవరకు చాలా లవ్ స్టోరీలను నడిపిన నయన్ తాజాగా డైరక్టర్ ను వలలో వేసుకుంది. అయితే వీరి ప్రేమ ముదిరి పాకాన పడినట్టు టాక్. ఎక్కడ ఫంక్షన్ జరిగినా సరే తన లవర్ తో దర్శనమిస్తున్న నయనతారను చూసి అందరు షాక్ అవుతున్నారు. ఇక ఈ క్రమంలో ఆమె గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటి అంటే నయనతార ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తోనే కలిసి ఉంటుందట.
అదేంటి పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కొంతమంది మాత్రం ఆల్రెడీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని అంటున్నారు. ఇద్దరికి రహస్యంగా పెళ్లి జరిగిందని అయితే ఇదవరకు తన పెళ్లి విషయం బయట పడగానే అల్లరి అయ్యింది కాబట్టి కాస్త సమయం తీసుకుని విషయం బయట పెట్టే ఆలోచన చేస్తున్నారట.. మరి ఎంత త్వరగా ఈ విషయం మీద ఓ క్లారిటీ ఇస్తే అంత మంచిది లేకుండా మీడియా వాళ్లు వాళ్ల ఇష్టానికి రకరకాలుగా రాసేస్తుంటారు.
ఇప్పటికే కోలీవుడ్ మీడియా నయన్ మీద బీభత్సమైన రూమర్స్ మొదలయ్యాయి. విఘ్నేష్ తో పెళ్లి జరిగింది నిజమే అయితే ఇప్పటికైనా బయట పడితే మంచిది లేదంటే ఈ విషయం ఇంకా పెద్దది చేసి రచ్చ రచ్చ చేయడం ఖాయం.