Posted [relativedate]
రోడ్డెక్కితే చాలు ఏ మూలన ట్రాఫిక్ కానిస్టేబుల్ వాహనాన్ని ఆపుతారో తెలియదు.. దీనితో చాలా చోట్ల వాహనదారులు బిక్కుబిక్కుమంటూ నడుపుతుంటారు. ఇకపై ఈ పరిస్థితి ఉండదు. హోమ్ గార్డ్, కానిస్టేబుల్ , ఏఎస్సై లు వాహనాలను ఆపకుండా కొత్త రూల్స్ వచ్చాయి. వీటి ప్రకారం కేవలం ఎస్సై, అంతకన్నా పై స్థాయి అధికారులకు మాత్రమే వాహనాలు ఆపే అధికారం ఉంటుంది. ఒకవేళ హోమ్ గార్డ్, కానిస్టేబుల్, ఏఎస్సై ఎవరైనా ఆపితే… తమకు పిర్యాదు చెయ్యొచ్చని తెలిపారు ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనేర్ జితేందర్. వారిపై శాఖ పరమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు..