పోలీస్ బైక్ అపి తాళం లాక్కోవచ్చా?

 Posted October 18, 2016

traffic police take key bike stopping
బైక్ మీద వెళ్తున్నప్పుడు పోలీసులు తనిఖీల కోసం ఆపడం…వాహనం ఆగిఆగగానే తాళం లాక్కోవడం సాధారణ వ్యవహారం అయిపోయింది.ఇలా పోలీసులకి బైక్ తాళాలు లాక్కునే అధికారముందా?ఈ ప్రశ్న చాలా మందికి చాలా సార్లు వచ్చి ఉంటుంది.కానీ అక్కడే ఆగిపోతారు అందరూ.హర్యానాకు చెందిన పవన్ పారిఖ్ అనే ఓ న్యాయవాది సమాచార హక్కు చట్టం ద్వారా రవాణా,హోమ్ శాఖల్ని ప్రశ్నించాడు.అందుకు ఆ రెండు శాఖలు పోలీసులకి ఆ హక్కు లేదని స్పష్టం చేశాయి.

బండి కి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు,లైసెన్స్ గురించి వాహనదారుణ్ని ఆపినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది .
1.బండి అపి తాళం లాక్కునే అధికారం ఏ పోలీస్ అధికారికి లేదు
2.ఏ పోలీస్ అధికారికి జరిమానా అప్పటికప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు
3 . లైసెన్స్ చేతిలో లేకుంటే దాని నెంబర్ చెప్పినా చాలు
4. ఎస్సై ,ఆపై స్థాయి అధికారులు తప్ప మిగిలిన వారు జరిమానా విధించడానికి అర్హులు కారు.

SHARE