ఏపీ లో రైలు ప్రమాదం…35 మంది మరణం

0
247
train accident in andhrapradesh

Posted [relativedate]

train accident in andhrapradesh
ఆంధ్ర ప్రదేశ్ లో నిన్న రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది.దాదాపు 35 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు.విజయ నగరం జిల్లా కొమరాడ మండలం,కూనేరు వద్ద హీరా ఖండ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది.రాత్రి 11 .30 టైం లో ఈ ప్రమాదం జరిగింది.ఎనిమిది భోగీలు పట్టాలు తప్పగా మూడు భోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి.చనిపోయినవారు కాకుండా ఓ వందమందికి గాయాలు అయ్యాయి.వారికి పార్వతీపురం,రాయ ఘడ్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.ఈ రైలు ప్రమాదం పై ప్రధాని మోడీ,రైల్వే మంత్రి సురేష్ ప్రభు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సహాయక చర్యల్లో ఏ ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకి సూచించారు.రైలు ప్రమాద దృశ్యాలు చూస్తుంటే గుండెలు బరువెక్కుతున్నాయి.

train accident in andhrapradesh

Leave a Reply