వర్షం కారణంగా రద్దైన రైళ్లు…

Posted on September 24, 2016 trains cancel rain effect
 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. పలు చోట్ల ట్రాక్‌ దెబ్బతినడంతో ఇవాళ 15 రైళ్లు రద్దు చేయగా, 21 రైళ్లు దారిమళ్లించారు.

రద్దైన రైళ్ల వివరాలు
* గుంటూరు -వికారాబాద్‌, వికారాబాద్‌-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌
* గుంటూరు-మాచర్ల ప్యాసింజర్‌, మాచర్ల- భీమవరం ప్యాసింజర్‌, మాచర్ల-నడికుడి ప్యాసింజర్‌
* రేపల్లె-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌- రేపల్లె డెల్టా పాస్ట్‌ ప్యాసింజర్‌
* నడికుడి-మాచర్ల ప్యాసింజర్‌, సికింద్రాబాద్‌-వికారాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌
* విజయవాడ-సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌
* పిడుగు రాళ్ల- మిర్యాలగూడ ప్యాసింజర్‌

దారిమళ్లించిన రైళ్లు
* హైదరాబాద్‌-తిరువనంతపురం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి మీదుగా దారి మళ్లించారు.
* కాజీపేట, విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌-గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌.
* విజయవాడ-కాజిపేట మీదుగా గుంటూరు-సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌
* విజయవాడ, కాజీపేట మీదుగా నర్సాపూర్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌
* తిరుపతి-సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రేణిగుంట, తెనాలి, విజయవాడ, కాజీపేట మీదుగా దారి మళ్లించారు.
* విశాఖ-సికింద్రాబాద్‌ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రాజమహేంద్రవరం, గుణదల, వరంగల్‌, కాజీపేట మీదుగా దారి మళ్లించారు.
* హైదరాబాద్‌-చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట, విజయవాడ,న్యూ గుంటూరు, తెనాలి మీదుగా దారి మళ్లించారు.
* సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట, గుణదల మీదుగా దారి మళ్లించారు.

SHARE