రవాణా మంత్రితో పడక జేసీని లాగారా?

Posted December 28, 2016

transport minister with jc
తెలుగు రాష్ట్రాల్లో రవాణా పాలిటిక్స్ జోరందుకున్నాయి. అదేనండి దివాకర్ ట్రావెల్స్ అధినేత … జేసీ ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ .. ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇద్దరు చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసురుకున్నారు. హైదరాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయానికి ఇద్దరూ వచ్చేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే ఈ రచ్చకు అసలు కారణం వేరే ఉందని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డికి… ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు అస్సలు పడట్లేదట. తాను చెప్పిన కొన్ని ట్రాన్స్ ఫర్ల విషయాన్ని మహేందర్ రెడ్డి లైట్ తీసుకున్నారట. గతంలో టీజీవో నేతగా ఉన్న ఆయన.. ఇప్పటికీ అధికారుల బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారట. ఇది మంత్రిగారికి నచ్చలేదట. దీంతో శ్రీనివాస్ గౌడ్ వేరే రూట్లో వచ్చి మహేందర్ రెడ్డిని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్నాట. అందులో భాగంగానే ప్రైవేట్ ట్రావెల్స్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. దివాకర్ ట్రావెల్స్ అయితే.. మహేందర్ రెడ్డిని ఎక్కువ ఇరుకున పెట్టవచ్చని ఆలోచించారట గౌడ్. అందుకే జేసీతో ఢీకి సిద్ధమయ్యారట.

మొత్తానికి జేసీ ఇష్యూలో శ్రీనివాస్ గౌడ్ పేరు హైలైట్ కావడంతో సీఎం కేసీఆర్ కూడా ఇష్యూ ఏంటని ఆరా తీశారట. దీంతో మహేందర్ రెడ్డి సరిగా ఆన్సర్ చేయలేకపోయారట. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న జేసీతో ఎందుకు పెట్టుకున్నారని కూడా మంత్రిగారిని నిలదీశారని సమాచారం. దీంతో మొత్తానికి శ్రీనివాస్ గౌడ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. తాను అనుకున్న లక్ష్యం నెరవేరిందని అనుచరులతో చెప్పుకుంటున్నారని టాక్.

SHARE