Posted [relativedate]
ఓం నమో వెంకటేశాయ సినిమా విడుదలకి సిద్ధమవుతోంది..ఈ దశలో ఊహించని సమస్య వచ్చిపడింది.ఈ సినిమా పేరు మార్చకపోతే సినిమా విడుదలని అడ్డుకుంటామని గిరిజన సంఘాల నేతలు వార్నింగ్ ఇచ్చారు.ఏడుకొండలవాడి పేరు మీద వస్తున్న సినిమా పేరు మార్పుకు వారు డిమాండ్ చేయడం వెనుక కారణం ఆ చిత్ర కథ కావడమే..ఈ సినిమాని శ్రీవారి పరమభక్తుడు హదీరామ్ బాబాజీ కేంద్రంగా సాగుతుంది.ఉత్తరాది నుంచి వచ్చి తిరుమలలో స్థిరపడి శ్రీవారిని భక్తితో గెలిచి ఆయనతోనే పాచికలు ఆడినట్టు చెప్తారు.ఆయన పేరుతో వున్న మఠం కేంద్రంగానే మహంతులు టీటీడీ పాలనలో తమ వంతు పాత్ర పోషించారు.అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే…
హదీరామ్ బాబా ఉత్తరాది గిరిజనుడని …ఆ అర్ధం వచ్చేలా సినిమాకి హదీరామ్ భావాజీ అని పేరు పెడితే బాగుంటుందని గిరిజన సంఘాలు అంటున్నాయి.శ్రీనివాస భక్తుడైన అన్నమయ్య జీవిత చరిత్ర తీసినప్పుడు సినిమాకి ఆయన పేరు పెట్టి ఇప్పుడు మాత్రం ఓం నమో వెంకటేశాయ అని పేరు పెట్టడంలో ఔచిత్యం ఏంటని వాదిస్తున్నారు.అంతటితో ఆగకుండా తిరుపతి లోని అలిపిరి శ్రీవారి పాదాల వద్ద గిరిజన యువత ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.