ఆ దెయ్యం సినిమా త్రిషకు ఛాన్స్ పోగొట్టిందా..

0
378
trisha lost chiru movie chance

qwqtrisha lost chiru movie chance

సినిమా ఫీల్డ్ అంటేనే అంత. ఒక్క హిట్ వస్తే సదరు మూవీలోని హీరోయిన్‌కు ఎక్కడలేని ఫోకస్ లభిస్తుంది. ఫట్టయ్యిందో ఇంక చెప్పుకోనక్కర్లేదు. ఆమెకు ఆఫర్లు రావడం గగనమైపోతుంది. ప్రస్తుతం త్రిష పరిస్థితి అలానే ఉందని అంటున్నారు. ‘నాయకి’ ఫలితం తారుమారవడంతో ఈ బ్యూటీని బుక్‌ చేసుకునేందుకు దర్శకనిర్మాతలు వెనకాడుతున్నారట.

చిరు 150 మూవీలో హీరోయిన్‌గా త్రిష పేరునూ పరిశీలించారట. అయితే.. నాయకి రిజల్ట్‌ ఈ అవకాశాన్ని దెబ్బతీసిందని చెప్పుకుంటున్నారు. నిజానికి ‘నాయకి’ సినిమా హిట్టయితే త్రిష రేంజ్ మరోలా ఉండేదని అంటున్నారు. స్టాలిన్ సినిమాలో చిరంజీవితో జోడీకట్టిన త్రిషను మరోసారి తీసుకునేవారట. ఈ ప్రపోజల్‌పై చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ చెన్నయ్ సుందరి నాయకి ప్రమోషన్లు పట్టించుకోకపోవడం.. ఆ సినిమాపైనే కాక ఆమె నటనపైనా కనీస చర్చ జరగకపోవడం.. ఈమె ఛాన్సులను దెబ్బతీశాయి. నాయకి రిజల్ట్‌తో.. డైరక్టర్ వినాయక్ త్రిషను తీసుకోవాలన్న ఆలోచన పక్కనపెట్టేశాడట. అదే ఆ సినిమా ఆడి ఉంటే..మెగాస్టార్ 150వ సినిమా కథానాయికగా అమ్మడు మెరిసిపోయి ఉండేదని ఫిల్మ్‌నగర్ టాక్.

Leave a Reply