ఫ‌స్ట్‌లుక్‌ : ‘మోహిని’.. మోడ్రన్ అమ్మవారు

 Posted October 19, 2016

trisha mohini movie first look

టాలీవుడ్, కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ముద్దుగుమ్మ త్రిష. ఇప్పటికీ అదే అందంతో వెలిగిపోతున్నా.. సీనియర్ హీరోయిన్ ట్యాగ్ లైన్ పడటంతో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకి కెరాఫ్ అడ్రస్ గా మారుతోంది త్రిష. ఇప్పటికే హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ‘నాయకి’లో నటించింది. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు.

ఇప్పుడు మళ్లీ అదే జోనర్ లో త్రిష ప్రధాన ప్రాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మోహిని’. ఆర్.మధేష్ దర్శకుడు. తెలుగు, తమిళ బాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ కూడా దాదాపు పూర్తయ్యింది. తాజాగా, ‘మోహిని ఫస్ట్ లుక్’ని రిలీజ్ చేసింది చిత్రబృందం. త్రిష స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ పిక్ ని రిలీజ్ చేసింది. ఇందులో త్రిష మోడ్రన్ అమ్మవారిలా కనిపిస్తోంది. హర్రర్ కామెడీని నమ్ముకొన్న త్రిషకి ‘మోహిని’ అయినా హిట్టిస్తుందేమో చూడాలి.

 
SHARE