త్రిష వరుడు అతడేనా?

0
509
trisha spouse sydney sladus

Posted [relativedate]

trisha spouse sydney sladus
ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడంలో హీరోయిన్ త్రిష తర్వాత ఎవరైనా. ఆ ఫ్రెండ్స్ లో ఆడ- మగా తేడా లేదు. అందరూ ఆమెకు ఒక్కటే. వారితో కలిసి రాత్రంతా షికార్లు చేసినా.. షాపింగులతో హడావుడి చేసినా అది ఈ అందాల ముద్దుగుమ్మకే సాధ్యం. అలాంటి త్రిష న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో ఏ రేంజ్ లో చేసుకుంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఈసారి అందుకు భిన్నంగా ఇంటికి పరిమితమైంది. అయితే సెలబ్రేషన్స్ మాత్రం ఓ రేంజ్ లో జరిగాయంటే. ఇంతవరకు ఓకే గానీ ఈ సెలబ్రేషన్స్ కు వచ్చిన అతిథులపైనే అందరి ఫోకస్ పడింది.

కొత్త సంవత్సర వేడుకల్లో త్రిష ఇచ్చిన పార్టీకి హాజరైంది కొద్దిమందేనట. అందులో ఆగ-మగ స్నేహితులు చాలా తక్కువమందే ఉన్నారట. అందుకు సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ హాట్ బేబీ. స్విమ్మింగ్ పూల్ లో ఈ అమ్మడితో పాటు ఒక అబ్బాయి… ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి త్రిష క్లోజ్ ఫ్రెండ్ అని చెబుతున్నారు. ఆ అబ్బాయి త్రిష పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ స్నేహితుడు సిడ్నీ స్లేడన్ ఉన్నాడు. స్విమ్మింగ్ పూల్ లో హాట్ హాట్ డ్రెస్ వేసుకొని… స్లేడన్ తో ఉండడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.

త్రిష ఎంగేజ్ మెంట్ బ్రేక్ అయిన తర్వాత స్లేడన్ తో ఆమె క్లోజ్ గా మూవ్ అవుతోందట. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టాక్. అంతేకాదు పెళ్లి గురించి కూడా ఆలోచన జరుగుతుందని సమాచారం. అన్నీ కుదిరితే స్లేడన్ నే త్రిష పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో త్రిష వరుడు అతడేనని చెన్నై జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

Leave a Reply