కొత్త ఇంట్లోకి ప్రవేశించనున్న త్రివిక్రమ్

0
650
trivikram build new house

Posted [relativedate]

trivikram build new houseత్రివిక్రమ్ శ్రీనివాస్… ఇతని డైరెక్షన్ లో ఓ సినిమా వస్తోందంటే చాలు…  ఇంక అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకుంటాయి. అంతలా తన మాటల గారడీతో అభిమానులను మెస్మరైజ్ చేస్తాడు త్రివిక్రమ్. ఇప్పటివరకు 18 సినిమాలకు మాటల్ని అందించిన ఈ మాటల మాంత్రికుడు 8 సినిమాలకు దర్శకత్వం వహించాడు. దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. ఇక ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నాళ్లకి త్రివిక్రమ్ ఓ సొంత ఇంటిని నిర్మించుకున్నాడు.

కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనట. ఇప్పటివరకు అతనికి హైదరాబాద్ లో సొంత ఇల్లు లేదట. గతేడాది ఫిలింనగర్ లో ఓ స్థలాన్ని కొన్న ఈ దర్శకుడు… తన  టేస్ట్ కు తగట్టు ఇంటి నిర్మాణం చేసాడట. ఇటాలియన్ ఫర్నిచర్ తో తన  ఇంటికి స్పెషల్ లుక్ ని తీసుకొచ్చాడట.  ఏప్రిల్ 29న త్రివిక్రమ్ దంపతులు కొత్త ఇంట్లోకి ప్రవేశించబోతున్నట్లు సమాచారం. తనకు అత్యంత సన్నిహితులైన పవన్ కళ్యాణ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి కొద్ది మందిని మాత్రమే త్రివిక్రమ్ ఈ కార్యక్రమానికి పిలుస్తున్నట్లు సమాచారం. తన సినిమాలో నటీనటులు ఉండే ఇంటి గురించి, ఫర్నీచర్ గురించే పర్టిక్యులర్ గా వ్యవహరించే త్రివిక్రమ్… తన సొంత ఇంటిని ఇంకెంత కేర్ ఫుల్ గా నిర్మించుకున్నాడో చూడాలంటే కొన్నిరోజులు వెయిట్ చెయ్యక తప్పదు.

Leave a Reply