మెగాస్టార్ ని డైరెక్ట్ చేయనున్న త్రివిక్రమ్ ?

 Posted October 19, 2016

trivikram directed to megastar chiranjeevi movie

మెగాస్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం రాబోతుందా.. ? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మెగాస్టార్ 150వ చిత్రం ‘ఖైదీ నెం. 150’ షూటింగ్ చివరి దశకు చేరుకొంది. దీంతో.. చిరు తదుపరి చిత్రంపై చర్చ మొదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగాస్టార్ 151 చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ఇందులో ఏమాత్రం నిజంలేదట.

అయితే, మెగాస్టార్ 152 చిత్రం మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనుందని చెబుతున్నారు.ఈ చిత్రాన్ని వైజయంతి బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మించనున్నారట. చిరు పొలిటికల్ కెరీర్ కి మరింత హెల్ప్ అయ్యే విధంగా త్రివిక్రమ్-చిరు సినిమా ఉండబోతున్నట్టు సమాచారమ్.

ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. పవన్ కోసం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఓ పవర్ ఫుల్ కథని రెడి చేశాడట త్రివిక్రమ్. టైటిల్ ‘దేవుడే దిగొచ్చినా’ పరిశీలనలో ఉంది. పవన్ చిత్రం తర్వాత త్రివిక్రమ్ మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. మొతానికి.. అన్నదమ్ములిద్దరికి పొలిటికల్ గా మైలేజ్ ఇచ్చేందుకు త్రివిక్రమ్ రెడీ అయినట్టు తెలుస్తోంది.

SHARE