Posted [relativedate]
కమెడియన్ నుండి హీరోగా మారిన సునిల్ ఈమధ్య వరుసగా ఫ్లాపులను ఫేస్ చేస్తున్నాడు. ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్టున్న సునీల్ కు లక్కీగా మారబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్. కెరియర్ మొదట్లో ఉన్న మంచి అనుబంధంతోనే ఇన్నాళ్లు సునీల్ కెరియర్ కు సహకరించిన త్రివిక్రం ఇప్పుడు హీరోగా మారిన తర్వాత సునీల్ కు ఓ లక్కీ ఆఫర్ ఇచ్చాడట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రం చేస్తున్న సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడట త్రివిక్రం.
హీరోగా మారాక కమెడియన్ గా కాని సపోర్టింగ్ రోల్స్ కాని చేయడం మానేసిన సునీల్ ప్రస్తుతం కెరియర్ అటు ఇటుగా ఉన్న కారణంగా త్రివిక్రం ఆఫర్ ను నో అని చెప్పడానికి కుదరలేదు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైది నెంబర్ 150 మూవీలో ఓ చిన్న రోల్ చేస్తున్న సునీల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడట. మరి హిట్ అన్న పదానికి కిలోమీటర్ దూరంలో ఉన్న సునీల్ కు ఈ రెండు సినిమాలు కమెడియన్ గా అయినా హిట్ అందిస్తే ఆ క్రేజ్ తో మళ్లీ హీరోగా కొనసాగాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న త్రివిక్రం పవన్ మూవీ త్వరలో రెగ్యులర్ షూట్ కు సిద్ధమవుతుంది. ఇక సునీల్ కూడా క్రాంతి మాధవ్ డైరక్షన్లో ఉంగరాల రాంబాబుగా వచ్చేందుకు రెడీగా ఉన్నాడు.