గులాబీ దళపతిపై అసంతృప్తి సెగలు!!

0
561
trs candidates unsatisfied about kcr behavior

Posted [relativedate]

trs candidates unsatisfied about kcr behavior
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో అసంతృప్తి రాజుకుంటోంది. అధికారం వచ్చి రెండున్నరేళ్లు అయిపోయింది. కానీ ఇప్పటిదాకా పదవుల భర్తీ జరగలేదు. నామ్ కే వాస్తే గా కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి చేతులు దులుపుకున్నారు. మిలిగిన వాటిపై ఇప్ప‌టిదాకా స్ప‌ష్ట‌త లేదు. ప్ర‌తి పండుగ ముందు హ‌డావుడి చేస్తున్నారు త‌ప్ప ప‌ద‌వుల భ‌ర్తీపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌డం లేదు గులాబీ బాస్.

తెలంగాణ ఉద్య‌మంలో కొంత‌మంది టీఆర్ఎస్ నాయ‌కులు ఎన్నో క‌ష్టన‌ష్టాలు ప‌డ్డారు. అయినా కేసీఆర్ కోసం అన్నీ భ‌రించారు. తెలంగాణ వ‌స్తే త‌మ‌కూ న్యాయం జ‌రుగుతుంద‌ని ఎంతో ఆశించారు. కానీ రాష్ట్రం వ‌చ్చాక వారికి మొండిచేయే మిగిలింది. ప‌క్క పార్టీల నుంచి వ‌స్తున్న వారికి అంద‌లమెక్కించారు… కానీ మొద‌టి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న‌వారిని ప‌ట్టించుకోవడం లేద‌ట‌. టీడీపీ నుంచి వ‌చ్చిన బ‌డా నాయ‌కులు.. వారి అనుచ‌ర గ‌ణానికి ఇచ్చిన ప్రాధాన్య‌త కూడా త‌మ‌కు ద‌క్క‌డం లేద‌ని గులాబీ నాయ‌కులు ఫీల‌వుతున్నార‌ని టాక్. పైర‌వీలు చేద్దామ‌న్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌.

క‌నీసం నామినేటెడ్ పోస్టులైనా ఇచ్చి త‌మ‌కు న్యాయం చేస్తార‌ని భావించార‌ట కొంత‌మంది టీఆర్ఎస్ నాయ‌కులు. కానీ అక్క‌డా వారికి నిరాశ త‌ప్ప‌లేదు. అధికారం లోకి వ‌చ్చి స‌గం పుణ్యకాలం అయిపోయింది… ఇప్ప‌టిదాకా మెజార్టీ నామినేటెడ్ పోస్టులు భ‌ర్తీ చేయ‌లేదు. క‌నీసం పార్టీ ప‌ద‌వులైనా ఇస్తారంటే అది కూడా లేదు. దీంతో వేచి చూసి….చూసి ఓపిక న‌శించిన టీఆర్ఎస్ నాయ‌కులు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నార‌ట‌. ఉద్య‌మంలో అన్నీ త్యాగం చేసి … వెంట న‌డిస్తే.. ఇప్పుడు మాత్రం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోతున్నార‌ట‌. అస‌లు తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను మ‌రిచి… బంగారు తెలంగాణ అంటూ పార్టీలో చేరుతున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నార‌ని మండిప‌డుతున్నార‌ట‌.

Leave a Reply