కేకేను ప్రభుత్వమే కార్నర్ చేసిందా..?

0
272
TRS Government Opposed To KK Land Grabbing

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మొన్నటివరకూ కేటీఆర్, హరీష్ పరోక్ష యుద్ధం గురించి ప్రతిపక్షాలను సెటైర్లేసేవి. కానీ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఎప్పుడూ ఇలాంటి గాసిప్పుల జోలికి పోలేదు. క్షేత్రస్థాయి సమస్యల మీదే మాట్లాడారు. కానీ ఫస్ట్ టైమ్ ఫక్తు పొలిటీషియన్ లా విమర్శలు చేశారు కోదండరాం. ల్యాండ్ స్కామ్ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేకే పేరు లీక్ చేసిందని కామెంట్ చేశారు.

కోదండ వ్యాఖ్యలు ఇటు జేఏసీలో, అటు ప్రజాసంఘాల్లో మరోవైపు ప్రభుత్వంలో కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. కోదండరాం మాటలతో ఉలిక్కిపడ్డ సర్కారు.. ఈ ప్రచారం పెరగక్కుండా ముందే అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. కానీ కేకేను కేసీఆర్ ఎందుకు ఇరికిస్తారనే వాదనకు మాత్రం చాలా బ్యాక్ గ్రౌండ్ ఉందంటున్నారు విమర్శకులు.

కేకేను టీఆర్ఎస్ లోకి తీసుకుంది ఢిల్లీ లెవల్లో లాబీయింగ్ కోసం. కానీ ఆయన పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదనేది కేసీఆర్ బావన. నిన్నగాక మొన్న ఎంపీ అయిన తన కూతురు కవితకు ఉన్న చొరవ కూడా లేదని, కనీసం సీనియర్ లీడర్లతో ర్యాపో మెయింటైన్ చేయడం లేదన్నది కేకే మీద ఫిర్యాదు. అందుకే ఆయన్ను వదిలించుకోవడానికి మార్గాలు వెతుకుతున్న గులాబీ బాస్ కు ల్యాండ్ స్కామ్ అచ్చొచ్చిన వరంలా మారింది.

Leave a Reply