Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు మాత్రం గుడి, బడి, పార్కు కాదేదీ కబ్జాకు అనర్హం అంటున్నారు. గులాబీ బ్యాచ్ ఆగడాలు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. కాంగ్రెస్, టీడీపీల హయాంలో కూడా జరగనంత భూకుంభకోణాలు కేసీఆర్ హయాంలో వెలుగుచూస్తున్నాయి.
సికింద్రాబాద్, సనత్ నగర్లో విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతులోకి వెళ్లిపోతున్నాయి. పైసా డబ్బు ఖర్చు లేకుండా రెవిన్యూ రికార్డులు మాయం చేయడం, దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం, స్థలం తమదేనని కోర్టులో కేసులు వేయడం ఇదీ తంతు. ఇందులో గులాబీ బ్యాచ్ చేసిందేముంది అంటారు. అక్కడే అసలు పాయింట్ ఉంది. మంత్రుల అండ చూసుకునే వీరు రెచ్చిపోతున్నారు.
కబ్జాలు చేసేది టీఆర్ఎస్ కార్యకర్తలే. భూమ్మంతర్ అంటూ పేదల నోట్లో మట్టికొడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ లు దేవుడెరుగు. ఉన్న గుడిసెలు కూడా పీకేస్తామని బెదిరిస్తున్నారని బస్తీల్లో జనం వాపోతున్నారు. కేసీఆర్ హయాంలో గూడు కూడా కరువైందని వారు ఆరోపిస్తున్నారు. ఏదో ఉద్ధరిస్తారని ఎన్నుకుంటే.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేని ఇంటి పన్ను కూడా వేస్తున్నారని మండిపడుతున్నారు.