టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్స్ పోజింగ్!!

0
268

Posted [relativedate]


మామూలు వ్యక్తులు ఏం చేసినా పెద్ద వార్త కాదు. కానీ ప్రజా జీవితంలో ఉన్న వారు ఏం చేసినా వార్తే. అందుకోసం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలు తప్పవు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఇలాంటి విమర్శలే వస్తున్నాయి.

మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్యను ఓడించి.. జనగాం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిది. గట్టి వాయిస్ తో ఆకట్టుకునే ఆయన.. ఈ మధ్య ఎక్స్ పోజింగ్ చేస్తున్నారు. అదే పనిగా షార్టులేసుకొని తిరుగుతున్నారు. ఏదో ఉదయం టైమ్ లో అయితే పర్లేదు కానీ అధికారిక కార్యక్రమాల్లోనూ షార్ట్స్ తోనే వస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి.

ఈ మధ్య ఓ రివ్యూ మీటింగ్ కు కూడా ముత్తిరెడ్డి షార్ట్ తోనే వచ్చేశారట. దీంతో విస్తుపోవడం అధికారుల వంతైంది. కొందరు మహిళా అధికారులతో ఆయనతో మాట్లాడ్డడానికి ఇబ్బండి పడ్డారట. అటు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఇటీవల ఆయన క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారట. అయితే షార్ట్ లో వచ్చిన ఆయనను ఎవరూ గుర్తుపట్టలేదట. మహిళలు ఈయన అవతారాన్ని చూసి షాకయ్యారట. ఎమ్మెల్యే అయి ఉండి ఇలా రావడమేంటని ఆయననే అడిగేశారని టాక్.

ఇన్ని విమర్శలొచ్చినా.. ముత్తిరెడ్డికి మాత్రం షార్ట్స్ పై ప్రేమ తగ్గలేదని ప్రచారం జరుగుతోంది. షార్ట్స్ తో పాటు అందుకు తగ్గట్టుగా మ్యాచింగ్ టీషర్టు, కళ్లద్దాలు పెట్టుకొని తిరుగుతున్నారట. ఈ ఓవరాక్షన్ ను తట్టుకోలేక కొందరు ప్రజాప్రతినిధులు మంత్రులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఏదైనా అతి చేస్తే ప్రమాదమే మరి.

Leave a Reply