టెన్ష‌న్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

0
258
trs mlas in tension

 Posted [relativedate]

trs mlas in tension
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు ఇప్పుడు కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. అస‌లే ఇటీవ‌ల వ‌చ్చిన ప్రోగ్రెస్ రిపోర్టులో చాలామందికి త‌క్కువ మార్కులు వ‌చ్చాయి. రిపోర్ట్-1 లో మంచి మార్కులు సాధించిన ఎమ్మెల్యేలు రిపోర్ట్ -2 లో దారుణంగా ప‌డిపోయారు. చాలామందికి అత్తెస‌రు మార్కులే వ‌చ్చాయి.

ఈ మార్కులే ఎమ్మెల్యేల స‌మ‌ర్థ‌త‌కు గీటురాయి అని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో వారంతా తెగ టెన్ష‌న్ పడుతున్నారు. అసెంబ్లీ స‌మావేశాల్లోనూ ఈ మార్కుల గురించి తెగ చ‌ర్చించుకుంటున్నారు అంతా. కొంప‌దీసి ఈ రిపోర్టు వ‌ల్లే త‌మ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వ‌కుండా మొండిచేయి చూపుతారా అన్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌రిస్థితి ఇలాగుంటే… త్వ‌ర‌లోనే మ‌రో రిపోర్ట్ రానుంద‌న్న వార్త వారిని మ‌రింత టెన్ష‌న్ పెడుతోంది.

ఏప్రిల్ చివ‌రి వారంలో వ‌రంగ‌ల్ వేదికగా టీఆర్ఎస్ భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నుంది. ఆ స‌భ‌లోనే కొత్త రిపోర్టును ప్ర‌క‌టిస్తార‌ని టాక్. ఇప్ప‌టికే 2 రిపోర్టుల‌తో ఎమ్మెల్యేలు ప‌రేషాన్ అవుతున్నారు. ఇప్పుడు రిపోర్ట్-3 ఎలా ఉంటుందోన‌ని తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారట‌. అందుకే ఇప్ప‌ట్నుంచే నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు చాలా యాక్టివ్ అయిపోయార‌ట‌. ప‌నులు వేగంగా జ‌రిగేలా చూస్తున్నార‌ట‌. ఎలాగైనా ఈసారి మంచి మార్కులు సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని స‌మాచారం. ఇందుకోసం ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల్లోనే పాగా వేసి…. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నార‌ని టాక్.

మొత్తానికి ఎమ్మెల్యేల‌కు మార్కుల టెన్షన్ తో ప్ర‌జ‌ల‌కు మాత్రం మంచే జ‌రుగుతోంది. ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న ప‌నుల‌న్నీ ఇప్పుడు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. ఎలా అయితేనేం… ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రుగుతోంది.. ఇంత కంటే కావాల్సింది ఏముంది???

Leave a Reply