టీఆర్ఎస్ ఎంపీల మినిస్ట్రీ బాధ‌!

0
123
trs mps sufferings for ministrys

Posted [relativedate]

trs mps sufferings for ministrys
దేశంలోనే అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ పార్ల‌మెంటు. అలాంటి పార్ల‌మెంటుకు ప్రాతినిధ్యం వ‌హించాల‌ని కోరుకునే రాజ‌కీయ నాయ‌కుడు ఉండ‌డంటే అతిశ‌యోక్తి కాదు. అలాంటి పార్ల‌మెంటుకు ఎన్నిక కావ‌డంపై కొంద‌రు టీఆర్ఎస్ ఎంపీలు లోలోప‌ల బాధ‌ప‌డుతున్నార‌ట‌. దానికి కార‌ణం పార్ల‌మెంటుకు వెళ్ల‌డం ద్వారా రాష్ట్రంలో మంచి అవ‌కాశాన్ని కోల్పోవ‌డ‌మే.

టీఆర్ఎస్ ఎంపీలు బాల్క సుమ‌న్, న‌గేశ్, జితేంద‌ర్ రెడ్డి, విశ్వేశ్వ‌ర్ రెడ్డి… తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ కు వెన్నంటి నిలిచారు. అందుకే వారంతా కేసీఆర్ కు వారంటే మంచి గురి. అయితే కొన్ని స‌మీక‌ర‌ణాలు, ఇత‌ర అంశాల ఆధారంగా అసెంబ్లీ టికెట్ ప్లేసులో వారికి ఎంపీ టికెట్ ల‌భించింది. ఎంపీలుగా గెలిచారు. అయితే అలా ఎంపీలు కావ‌డం వ‌ల్లే రాష్ట్రంలో మంత్రుల‌య్యే అవ‌కాశాన్ని వారు కోల్పోయార‌న్న‌ది స్ప‌ష్టం. ఎందుకంటే మంత్రి ప‌ద‌వికి కావాల్సిన అర్హ‌త‌ల‌న్నీ వారికి ఉన్నాయి. అందుకే ఈసారి మిస్స‌యినా.. వ‌చ్చేసారి మాత్రం అసెంబ్లీకి వెళ్లేది లేదంటున్నారు ఎంపీలు.

బాల్క సుమ‌న్ ఇప్ప‌టికే కేసీఆర్ తో మాట్లాడార‌ట‌. వ‌చ్చేసారి త‌న బ‌దులు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వివేక్ కు ఎంపీ టికెట్ ఇవ్వాల‌ని కోరార‌ట‌. త‌న‌కు మాత్రం అసెంబ్లీ టికెట్ ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశార‌ని టాక్. అటు న‌గేశ్ కూడా త‌న‌కు ఎంపీ కంటే అసెంబ్లీ అయితేనే బెట‌ర‌ని చెప్పార‌ట‌. ఇటు జితేంద‌ర్ రెడ్డి, విశ్వేశ్వ‌ర్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని కేసీఆర్ తో పంచుకున్నార‌ని టాక్. అయితే కేసీఆర్ వీరి మొర‌ను ఆల‌కిస్తారా..? నిజంగానే అసెంబ్లీ టికెట్ తో పాటు మంత్రిప‌ద‌వి కూడా ఇస్తారా అన్న‌ది చూడాలి.

Leave a Reply