కోదండ రామ్ ని తెరాస ఎంత మాటంది?

trs-comments-on-kodandaramరోజులన్నీ ఒకలా వుండవు….రాజకీయాల్లో ఈ మార్పు ఇంకాస్త అనూహ్యం గా ఉంటుంది. తెలంగాణ జాక్ చైర్మన్ కోదండరాం కి ఇదే అనుభవం ఎదురవుతోంది.నిన్నమొన్నటి దాకా ఆయన్ని విమర్శించడానికి కాస్త ముందువెనుక చూసిన తెరాస నేతలు మొహమాటాలన్నీ పక్కన బెట్టారు. తాజాగా ఆ పార్టీ ఎంపీ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో కోదండరాం ని దూషించారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని రెండు సార్లు కలిశాకే కోదండరాం మల్లన్న సాగర్ ఉద్యమంలో పాల్గొన్నారని సుమన్ అన్నారు.ఆ భేటీలో ఏమి జరిగిందో బహిరంగపరచాలని సుమన్ డిమాండ్ చేశారు.తెరాస మీద జాక్ ముసుగు వేసుకుని పోరాటం చేస్తున్న కోదండ కుబుసం విడిచిన పాము అని సుమన్ అభివర్ణించారు.కాంగ్రెస్ చేస్తున్న అనైతిక పోరాటంలో కోదండ శిఖండి పాత్ర పోషిస్తున్నారని సుమన్ ఆరోపించారు.కోదండ మీద తెరాస ఎదురుదాడి చేస్తున్నా ఈ స్థాయిలో మాట్లాడ్డం ఇదే మొదటిసారి.

SHARE