టీఅసెంబ్లీలో మార్కుల లొల్లి!!

0
400
trs party discussion about on mlas and ministers rank in telangana assembly

Posted [relativedate]

trs party discussion about on mlas and ministers rank in telangana assemblyతెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలంతా ఒకటే అంశం గురించి చర్చించుకుంటున్నారు. అదేంటంటే శాసనసభ్యుల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మార్కులు కేటాయించారు. ఆ మార్కుల గురించే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు.

అసెంబ్లీలో పార్టీలకతీంగా ఎమ్మెల్యేలంతా తమకు వచ్చిన మార్కులపై చర్చించుకుంటున్నారట. మార్కులు ఎక్కువొచ్చిన వారు.. తమ పనితీరుకు ఇదే నిదర్శనమని చెప్పుకుంటున్నారు. అయితే తక్కువ మార్కులొచ్చిన ఎమ్మెల్యేలు మాత్రం.. ఈ సర్వే అంతా తూచ్ అంటున్నారు.

అయితే సర్వేలో తెలంగాణలో అన్ని అసెంబ్లీ స్థానాలు కవర్ కావడంతో విపక్ష సభ్యులు కూడా దీనిపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆశ్చర్యకరంగా కొంతమంది విపక్ష సభ్యులకు ఈ సర్వేలో మంచి మార్కులు వచ్చాయి. అవి నిజంగానే వచ్చాయా..? లేకపోతే విపక్ష నేతలను బుట్టలో వేసుకునేందుకు ఎక్కువ మార్కులేశారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఈ సర్వే ఫలితాల ఆధారంగానే సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై ఒక అంచనాకు వచ్చారట. ఆ మార్కుల ఆధారంగానే ఎమ్మెల్యేలకు ఏ రేంజ్ లో గౌరవం ఇవ్వాలో ఆలోచిస్తున్నారట. ఎక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలకు పార్టీ లేదా ప్రభుత్వంలో సముచిత గౌరవం ఇచ్చే యోచనలో ఉన్నారని టాక్. అదే సమయంలో తక్కువ మార్కులు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు … సీఎం కేసీఆర్ తలంటినట్టు కూడా తెలుస్తోంది. ఈ మేరకు ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ నుంచి ఫోన్ వెళ్లినట్టు టాక్. ఇప్పటికైనా పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వడం కూడా కష్టమేనని గట్టిగానే హెచ్చరించారట. మొత్తానికి ఈ మార్కుల లొల్లి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply