ఫోటోల‌ను లైట్ తీసుకున్న కేసీఆర్ ప్ర‌భుత్వం!!

Posted February 5, 2017

trs party not bothering nayeem pics with policeగ్యాంగ్ స్ట‌ర్ న‌యీంతో కొంద‌రు పోలీసుల‌కు సన్నిహిత సంబంధాలుండేవి. అత‌నితో చెట్టాప‌ట్టాలేసుకొని తిరిగిన వారిలో టాప్ క్యాడ‌ర్ ఆఫీస‌ర్లు కూడా ఉన్నార‌న్న వాద‌న ఉంది. కానిస్టేబుళ్లు, ఎస్సై, సీఐలు, ఏసీపీలు అత‌నికి లెక్కే లేద‌ట‌. అత‌ని రేంజ్ కు మినిమం ఐపీఎస్ ల‌తోనే దందాలు చేసే వాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అలాంటి ఉన్న‌తాధికారుల పేర్లు కూడా బ‌య‌టకు వ‌చ్చాయి. కానీ ఎందుక‌నో సిట్ రాక‌తో … ఆ పేర్ల‌న్నీ మ‌రుగున‌ప‌డ్డాయి.

ఈ మ‌ధ్య న‌యీంతో పోలీసులు దిగిన ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అధికారులు అత‌నితో క‌లిసి విందు ఆర‌గిస్తూ ఫోటోల‌కు పోజులిచ్చారు. ఇంత క్లియ‌ర్ గా నయీంతో అధికారుల ఫోటోలు బ‌య‌ట‌కు వ‌స్తే… కేసీఆర్ ప్ర‌భుత్వం మాత్రం లైట్ తీసుకుంటోంది. ఫోటోల ఆధారంగా అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం కుద‌ర‌ద‌ట‌. ఈ విష‌యాన్ని తెలంగాణ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి ప్ర‌కటించ‌డం గ‌మ‌నార్హం.

ఫోటోల విష‌యాన్ని ప్ర‌భుత్వం లైట్ తీసుకోవ‌డంపై ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఫోటోల ఆధారంగా చ‌ర్య‌లు తీసుకుంటే.. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ఫోటోలు బ‌య‌టకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అందులో టీఆర్ఎస్ నాయ‌కులు కూడా ఉంటే ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇవ‌న్నీ ఊహించారు కాబ‌ట్టే… ముందు జాగ్ర‌త్త‌గా ఫోటోల‌ను లైట్ తీసుకుంటున్నార‌ని టాక్.

అటు మ‌రికొంద‌రైతే న‌యీంతో అంట‌కాగిన టీఆర్ఎస్ నాయ‌కుల ఫోటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని చెబుతున్నారు. కానీ ప్ర‌భుత్వం కావాల‌నే వాటిని దాచి పెట్టింద‌ని చెబుతున్నారు. ఇందులో వాస్త‌వం ఉన్నా.. లేక‌పోయినా… ఒక్క‌టి మాత్రం నిజం. న‌యీం కేసులో తెలంగాణ ప్రభుత్వం చాలా ప్లాన్ట్ గా ముందుకెళ్తోంది. టీఆర్ఎస్ నాయ‌కుల‌కు ఏమాత్రం మ‌ట్టి అంట‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. అధికార పార్టీ కావ‌డం వ‌ల్లే టీఆర్ఎస్ కు ఈ అడ్వాంటేజ్ ఉంది. వేరే పార్టీ అధికారంలో ఉంటే.. టీఆర్ఎస్ కు చెందిన ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్సీలు జైలుజీవితం గ‌డ‌పాల్సి వ‌చ్చేంద‌న్న టాక్ వినిపిస్తోంది.

SHARE