వ‌ర్గీక‌ర‌ణ‌ను ఒడిసిప‌ట్టేసిన‌ టీఆర్ఎస్

0
231
trs solving sc caste improvement

Posted [relativedate]

trs solving sc caste improvement
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ జ‌రుగుతుందా… లేదా అన్న‌ది ప‌క్క‌న‌బెడితే.. ఆ పోరాటం జ‌రుగుతున్న తీరు మాత్రం ఎస్సీల్లో టీఆర్ఎస్ ఇమేజ్ ను ఒక్క‌సారిగా పెంచేసింది. ఎందుకంటే కేసీఆర్ ప్ర‌భుత్వం ఆ దిశ‌గా ఏదో చేస్తోంద‌న్న సంకేతాలు ఎస్సీల‌కు వెళ్తున్నాయి. ముఖ్యంగా ఇదే అంశంపై ఎప్ప‌టినుంచో పోరాడుతున్న ఎమ్మార్పీఎస్, కాంగ్రెస్ కూడా వెనుక‌బ‌డిపోయాయి.

నిజానికి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ స‌మ‌స్య ఇప్ప‌టిది కాదు. ఏళ్లుగా ఉన్న‌దే. పైగా దీని కోసం ఎమ్మార్పీఎస్ నుంచి మంద‌కృష్ణ చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. చివ‌ర‌కు గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్రం కూడా వ‌ర్గీక‌ర‌ణ‌పై చొర‌వ చూపింది. అసెంబ్లీలో వ‌ర్గీక‌ర‌ణ‌పై తీర్మానం చేసింది.. అయితే ఆ తీర్మానం అసెంబ్లీ వ‌ర‌కే ఆగిపోయింది. కేంద్ర‌ప్ర‌భుత్వం వ‌ర‌కు ఆ స‌మ‌స్య‌ను తీసుకెళ్ల‌డంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. సొంత పార్టీ ప్ర‌భుత్వమే ఢిల్లీలో ఉన్నా..రాష్ట్ర కాంగ్రెస్ ఆ దిశ‌గా అడుగులేయ‌లేదు. ఫ‌లితంగా వ‌ర్గీక‌ర‌ణ స‌మ‌స్య ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా త‌యారైంది.

ఏ అంశాన్న‌యినా ఒడిసి ప‌ట్టుకోవ‌డంలో ఆరితేరిన సీఎం కేసీఆర్… వ‌ర్గీక‌ర‌ణ‌ను కూడా అలాగే క్యాచ్ చేశారు. వ‌ర్గీక‌ర‌ణ‌పై ఢిల్లీకి అఖిల‌ప‌క్షాన్ని తీసుకెళ్తాన‌ని మాట ఇచ్చారు. దాన్ని నెర‌వేర్చే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఆ దిశ‌గా ప్ర‌ధాని అపాయింట్ మెంట్ కోసం వేచి చూస్తున్నారు. ప్ర‌ధాని అపాయింట్ మెంట్ ల‌భించ‌క‌ముందే.. వ‌ర్గీక‌ర‌ణ‌పై కేసీఆర్ ఏదో చేసేస్తున్నార‌న్న సంకేతాలు ఎస్సీల్లో వెళ్లేలా చేశారు. టీఆర్ఎస్ కు చెందిన లీడ‌ర్లు కూడా ఆ స్థాయిలో క‌ల‌రింగ్ ఇవ్వ‌డంతో … ఇప్పుడు కేసీఆర్ ఇమేజ్ మ‌రింత పెరిగింది.

వ‌ర్గీక‌ర‌ణ అంశం స‌క్సెస్ అవుతుందా.. లేదా.. అన్న‌ది ప‌క్క‌న బెడితే… కేసీఆర్ మాత్రం ఈవిష‌యంలో ప‌రిపూర్ణ విజ‌యం సాధించారు. కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ ను ఎప్పుడో వెన‌క్కు నెట్టేశారు. వ‌ర్గీక‌ర‌ణ అంటేనే టీఆర్ఎస్ కే సాధ్య‌మ‌నే రేంజ్ లో బిల్డ‌ప్ ఇచ్చేస్తున్నారు. ఎంతైనా వ్యూహమంటే కేసీఆర్ దే!!!

Leave a Reply