టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పల్లా!!

0
253
trs working president palla rajeswar reddy
Posted [relativedate]
trs working president palla rajeswar reddy
తెలంగాణలో ప్రస్తుతం రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ విధానాన్ని ఫాలో అవుతున్నారు. దీంతో టీఆర్ఎస్ కూడా అదే పోస్టును క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట. సీఎం కేసీఆర్ ఆదిశగా ఇప్పటికే నాయకులతోనూ మంతనాలు జరిపారట. టీఆర్ఎస్ లోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించేందుకు సానుకూల సంకేతాలిచ్చారట కేసీఆర్.

తెలంగాణలో ఇప్పుడు రెడ్డి నాయకులంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు. సాధారణంగానే తెలంగాణలో బలమైన సామాజిక వర్గం రెడ్లు. ఈ రెడ్లంతా ఇప్పుడు టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్నట్టు కేసీఆర్ కు సూచనలొచ్చాయట. ఈ నేపథ్యంలో ఈ అసంతృప్తిని చల్లార్చి రెడ్లను టీఆర్ఎస్ వైపు తీసుకొచ్చేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని రెడ్డి నాయకుడికి కట్టబెట్టేందుకు ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, శాసనమండలి లో విప్ గా ఉన్న పల్లా రాజేశ్వరికి ఆ పదవి ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

పల్లా రాజేశ్వర్ రెడ్డి అయితే కాంగ్రెస్ తో పాటు టీడీపీకి కౌంటర్ ఇవ్వొచ్చని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. రెడ్డి నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. దీనికి గండిగొట్టాలని కేసీఆర్ ప్లాన్ వేశారు. ఇందులోభాగంగా, సీనియర్ నేత, హోంమంత్రి నాయని నర్సింహా రెడ్డి పేరును ముందుగా పరిశీలించారట. వయసు రీత్యా ఆయన కంటే యువకుడైన పల్లా రాజేశ్వర రెడ్డి వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. ఏప్రిల్‌లో జరిగే తెలంగాణా రాష్ట్ర సమితి ప్లీనరీలో అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉందని తెరాస వర్గాల సమాచారం.

Leave a Reply