అమెరికా ముక్కలవుతుందా?మరి ఫెవికాల్ ఎవరిదగ్గర?

0
526

trump american speech
ప్రపంచ పోలీస్ అమెరికా ముక్కలవుతుందా? ఎవరికీ రాని ఈ డౌట్ ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కి వచ్చింది . రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ ఖరారైన తర్వాత క్లీవ్ ల్యాండ్ లో సదస్సులో మాట్లాడారు. అమెరికా ఇప్పుడు పెద్ద సంక్షోభంలో చిక్కుకుందని… దారిద్ర్యం, పేదరికంలో కూరుకుపోయిందని… దాన్నుంచి అమెరికన్స్ ను కాపాడేది తాను మాత్రమేనని చెప్పారు.

వ్యవస్థలో గుట్టుమట్లు, లోటు పాట్లు తనకు తెలిసినంతగా మరొకరికి తెలియవు. అందుకే చెబుతున్నా నా వల్ల మాత్రమే మీ కష్టాలు తీరతాయని ట్రంప్ అభయమిచ్చారు .పైగా ముక్కలు కాబోతున్న దేశాల్లో అమెరికా ఉందని ..దాన్ని అతికించే శక్తి తనకే ఉందని కూడా ట్రంప్ మహాశయుడు సెలవిచ్చాడు .. వలసల వల్ల దెబ్బతింటున్న అమెరికన్ల జీవితాల్ని బాగు చేసే సత్తా వున్నది తనకేనని ట్రంప్ వివరించారు ..మొత్తానికి కష్టాల భయం పెట్టి అమెరికన్ల ఓట్లు కొల్లగొట్టేందుకు ట్రంప్ ప్లాన్ వేశాడు.

Leave a Reply